Sun Pharma: ఔషధ రంగంలో భారీ డీల్.. సన్‌ఫార్మా చేతికి అమెరికా సంస్థ 'ఆర్గానన్'
వ్రాసిన వారు
Sirish Praharaju
Apr 27, 2026
09:42 am
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థ 'ఆర్గానన్ అండ్ కో'(Organon & Co) ను కొనుగోలు చేయనున్నట్లు భారత ఔషధ రంగ దిగ్గజం సన్‌ఫార్మా(Sun Pharma) ప్రకటించింది. ఈ భారీ ఒప్పందం విలువ సుమారు 11.75 బిలియన్ డాలర్లు, అంటే రూపాయల్లో లక్ష కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒక్కో షేరుకు 14 డాలర్ల ధరకు, పూర్తిగా నగదు రూపంలో ఈ కొనుగోలు జరగనున్నట్లు సన్‌ఫార్మా వెల్లడించింది. ఈ ఒప్పందం పూర్తయిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్ర 25 ఔషధ సంస్థల జాబితాలో సన్‌ఫార్మా స్థానం సంపాదించనుంది. ఈ కొనుగోలు ద్వారా సంస్థ అంతర్జాతీయంగా తన స్థాయిని మరింత బలోపేతం చేసుకోనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆర్గానన్‌ను దక్కించుకోనున్న సన్‌ఫార్మా
Sun Pharmaceutical to Acquire Organon Valued at $11.75 Billion https://t.co/Y6oXMc78tq
— WSJ Business News (@WSJbusiness) April 27, 2026