Tata group stocks: టాటా కెమికల్స్ షేరు విలువ ఒక్కరోజులో రూ.122 పెరుగుదల
ఈ వార్తాకథనం ఏంటి
టాటా గ్రూప్ షేర్లలో మంగళవారం భారీ ఉత్సాహం కనిపించింది. టాటా సన్స్ ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్సును వదులుకునేందుకు చేసిన ప్రయత్నానికి ఆర్‌బీఐ నిరాకరించడంతో.. టాటా సన్స్ లిస్టింగ్‌పై మళ్లీ చర్చ మొదలైంది. ఈ పరిణామం టాటా గ్రూప్‌లోని పలు లిస్టెడ్ కంపెనీల షేర్లకు కలిసొచ్చింది. ముఖ్యంగా టాటా కెమికల్స్ ఏకంగా 20 శాతం దూసుకెళ్లింది.
వివరాలు
టాటా సన్స్‌కు లిస్టింగ్ తప్పనిసరి?
ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించిన అప్పర్‌లేయర్ విభాగంలో టాటా సన్స్ ఉంది.
ఈ కేటగిరీలోని సంస్థలు తప్పనిసరిగా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదుకావాల్సి ఉంటుంది.
ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్సును వదులుకోవడానికి టాటా సన్స్ చేసిన దరఖాస్తును ఆర్‌బీఐ తిరస్కరించింది.
దీంతో లిస్టింగ్ నుంచి మినహాయింపు పొందే మార్గం మూసుకుపోయినట్లయింది. ఫలితంగా టాటా సన్స్ కూడా స్టాక్ మార్కెట్‌లో నమోదుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టాటా సన్స్‌కు ఐటీ, ఆటోమొబైల్, స్టీల్, కన్జూమర్ ప్రొడక్ట్స్, ఏవియేషన్, హాస్పిటాలిటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి కీలక రంగాల్లోని పలు లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో మెజారిటీ వాటాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో టాటా సన్స్ లిస్టింగ్‌కు సంబంధించిన పరిణామాలు గ్రూప్‌లోని అనుబంధ సంస్థలపై ప్రభావం చూపుతాయనే అంచనాలతో మంగళవారం ఆయా షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి.
వివరాలు
టాటా కెమికల్స్ 20 శాతం జంప్
మంగళవారం ట్రేడింగ్‌లో టాటా కెమికల్స్ షేరు ఏకంగా 20 శాతం లాభపడి అప్పర్ సర్క్యూట్‌ను తాకింది.
ఎన్‌ఎస్‌ఈలో ఒక్కరోజులోనే షేరు విలువ రూ.122 పెరిగి రూ.734.90కి చేరింది.
ఇదే సమయంలో టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఇంట్రాడేలో 15.24 శాతం వరకు లాభపడింది. ఇతర టాటా గ్రూప్ షేర్లలోనూ కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది.
వివరాలు
ఇతర టాటా షేర్ల పరిస్థితి
మంగళవారం ట్రేడింగ్‌లో టాటా గ్రూప్‌కు చెందిన పలు షేర్లు ఈ విధంగా రాణించాయి:
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ - 5.89 శాతం
టీసీఎస్ - 5.47 శాతం
టాటా ఎలెక్సీ - 4.28 శాతం
టాటా పవర్ - 3.41 శాతం
టాటా కమ్యూనికేషన్స్ అడ్వాన్స్‌డ్ - 3.21 శాతం
టాటా స్టీల్ - 1.96 శాతం
టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ - 1.72 శాతం
అయితే మార్కెట్ ముగిసే సమయానికి కొంత లాభాల స్వీకరణ చోటుచేసుకుంది.
దీంతో టాటా పవర్, టాటా కమ్యూనికేషన్స్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ స్వల్ప నష్టాల్లో ముగిశాయి.
మిగిలిన టాటా గ్రూప్ షేర్లు కూడా ఇంట్రాడే గరిష్ఠాలతో పోలిస్తే కొంత లాభాలను కోల్పోయాయి.