Loading...
Tata Sons: చంద్రశేఖరన్ రాజీనామా.. టాటా సన్స్ తదుపరి ఛైర్మన్‌ను ఎలా ఎంపిక చేస్తుంది?
చంద్రశేఖరన్ రాజీనామా.. టాటా సన్స్ తదుపరి ఛైర్మన్‌ను ఎలా ఎంపిక చేస్తుంది?

Tata Sons: చంద్రశేఖరన్ రాజీనామా.. టాటా సన్స్ తదుపరి ఛైర్మన్‌ను ఎలా ఎంపిక చేస్తుంది?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 12, 2026
02:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా నిర్ణయంతో కార్పొరేట్‌ భారత్‌లో అత్యంత ఆసక్తికరంగా మారిన వారసత్వ ఎంపిక ప్రక్రియకు తెరలేచింది. దేశంలోనే అతిపెద్ద వ్యాపార సమూహాల్లో ఒకటైన టాటా గ్రూప్‌కు తదుపరి ఛైర్మన్‌ను ఎంపిక చేయడంలో టాటా ట్రస్ట్స్ కీలక పాత్ర పోషించనున్నాయి. చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి వరకు ఉంది. దీంతో టాటా సన్స్ బోర్డు ఆయన రాజీనామాను అంగీకరిస్తే.. కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేసి, బాధ్యతలను సజావుగా అప్పగించేందుకు టాటా గ్రూప్‌కు కొంత సమయం లభించనుంది. తాజా నివేదికల ప్రకారం చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం ముగిసే వరకు కొనసాగి, ఆ తర్వాత పునర్నియామకానికి తనను తాను ప్రతిపాదించకూడదని నిర్ణయించుకున్నారు.

వివరాలు 

టాటా ట్రస్ట్స్‌కు కీలక అధికారం

సాధారణంగా కంపెనీల్లో ఛైర్మన్‌ను ఎంపిక చేసే విధానానికి టాటా సన్స్‌లో మాత్రం ప్రత్యేకమైన ప్రక్రియ ఉంది.

కొత్త ఛైర్మన్‌ను బోర్డు తనంతట తానే ఎంపిక చేయలేదు.టాటా సన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లో ప్రత్యేకమైన ఎంపిక విధానం ఉంది.

టాటా సన్స్‌లో దాదాపు 66శాతం వాటాను కలిగి ఉన్న టాటా ట్రస్ట్స్‌కు ఈ ప్రక్రియలో కీలక అధికారం ఉంటుంది.

అయితే తుది నియామకాన్నిటాటా సన్స్ బోర్డు చేపడుతుంది.

ఈసారి ఈ ఎంపిక ప్రక్రియకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. టాటా ట్రస్ట్స్‌లో పాలనకు సంబంధించిన కొన్ని విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త ఛైర్మన్ ఎంపిక జరగనుంది.

ముఖ్యంగా సర్ రతన్ టాటా ట్రస్ట్ (SRTT)కు సంబంధించిన అంశాలు మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్‌ వద్ద విచారణలో ఉన్నాయి.

వివరాలు 

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

టాటా సన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లోని ఆర్టికల్ 118 ప్రకారం.. టాటా చారిటబుల్ ట్రస్ట్స్ సమష్టిగా నిర్దేశిత స్థాయిలో వాటాను కొనసాగిస్తున్నంతకాలం ఛైర్మన్‌ను ఎంపిక చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి.

ఈ విధానం ప్రకారం తదుపరి ఛైర్మన్ ఎవరనేది నిర్ణయించడంలో టాటా ట్రస్ట్స్‌ది కీలక పాత్ర.

టాటా ట్రస్ట్స్‌ సూచించిన వ్యక్తిని చివరికి టాటా సన్స్ బోర్డు ఛైర్మన్‌గా నియమిస్తుంది. ఇలాంటి విధానాన్ని గతంలోనూ అనుసరించారు.

2016 అక్టోబర్‌లో సైరస్ మిస్త్రీని టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించిన తర్వాత.. ఆయన స్థానంలో కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేసేందుకు టాటా సన్స్ ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.

ఆ సమయంలో రతన్ టాటా తాత్కాలిక ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

ADVERTISEMENT

వివరాలు 

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

ఆ ఎంపిక కమిటీలో రతన్ టాటా,వేణు శ్రీనివాసన్,అమిత్ చంద్ర,మాజీ దౌత్యవేత్త రోనెన్ సేన్,లార్డ్ కుమార్ భట్టాచార్య ఉన్నారు.

చివరకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అప్పటి సీఈఓ,మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న చంద్రశేఖరన్ పేరును కమిటీ ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది.

2017 జనవరిలో టాటా సన్స్ బోర్డు ఆ సిఫార్సును ఆమోదించింది.

అదే ఏడాది ఫిబ్రవరిలో చంద్రశేఖరన్ అధికారికంగా ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

అయితే ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. సైరస్ మిస్త్రీని తొలగించినప్పుడు టాటా గ్రూప్‌లో వెంటనే నాయకత్వ ఖాళీ ఏర్పడింది.

అందుకే కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేసే వరకు రతన్ టాటా తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

ఇప్పుడు చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరిలో ముగియనుండటంతో.. కొత్త ఛైర్మన్ ఎంపికకు టాటా సన్స్‌కు కొన్ని నెలల సమయం పట్టచ్చు.

దీంతో తాత్కాలిక ఛైర్మన్‌ను నియమించాల్సిన అవసరం లేకుండానే చంద్రశేఖరన్ నుంచి నేరుగా కొత్త ఛైర్మన్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

వివరాలు 

టాటా ట్రస్ట్స్‌దే కీలక పాత్ర

ఈ ప్రక్రియలో టాటా ట్రస్ట్స్‌లో ఏకాభిప్రాయం సాధించడమే పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది.

పాలన,ట్రస్టీల నియామకాలు,పదవీకాలం, టాటా సన్స్ బోర్డులో ప్రాతినిధ్యం వంటి అంశాలపై ట్రస్ట్స్‌లో కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి.

వీటిలో కొన్ని అంశాలు మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్‌ ముందు విచారణ వరకు వెళ్లాయి.

ముఖ్యంగా రెండు ప్రధాన టాటా ట్రస్ట్స్‌లో ఒకటైన సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు సంబంధించిన వ్యవహారాలు చర్చనీయాంశమయ్యాయి.

మేలో ఛారిటీ కమిషనర్.. SRTTలో జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేయాలని ట్రస్టీలను ఆదేశించారు.

అయితే ఈ ఆదేశాలు ఏకపక్షంగా జారీ అయ్యాయని, SRTTకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, తమ వాదన వినలేదని టాటా ట్రస్ట్స్ తెలిపింది.

ఈ ఆదేశాలు SRTTకు మాత్రమే వర్తిస్తాయని తాము భావిస్తున్నట్లు పేర్కొంది.

వివరాలు 

టాటా ట్రస్ట్స్‌దే కీలక పాత్ర

SRTT బోర్డు కూర్పుపై వచ్చిన ఫిర్యాదు, ట్రస్టీ వేణు శ్రీనివాసన్ చేసిన ప్రత్యేక అభ్యర్థన లేదా ఫిర్యాదు నేపథ్యంలో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది.

శాశ్వత ట్రస్టీల పదవీకాలానికి సంబంధించిన వాదనలను కూడా టాటా ట్రస్ట్స్ వ్యతిరేకించింది.

కొత్త ఛైర్మన్ ఎంపికలో ప్రధాన టాటా ట్రస్ట్స్ భాగస్వామ్యం కావాల్సి ఉండటంతో.. ఈ విభేదాలు ప్రస్తుత వారసత్వ ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ట్రస్ట్స్‌లో ఏకాభిప్రాయం కుదరకపోతే కొత్త ఛైర్మన్ ఎంపిక ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది.

అందువల్ల మొదటి సవాలు కొత్త ఛైర్మన్ అభ్యర్థిని వెతకడం కంటే.. ఎంపికకు అవసరమైన పాలనా వ్యవస్థ సజావుగా పనిచేసేలా చూడటమే కావచ్చు.

వివరాలు 

అంతర్గత వ్యక్తికా.. బయటి వ్యక్తికా?

ఎంపిక ప్రక్రియ మొదలైన తర్వాత టాటా గ్రూప్ మరో కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

చంద్రశేఖరన్ తరహాలో సంస్థలోనే అనుభవం ఉన్న వ్యక్తికి బాధ్యతలు అప్పగించాలా? లేక బయటి వ్యక్తిని తీసుకురావాలా? అనేది తేల్చుకోవాలి.

2017లో చంద్రశేఖరన్ ఎంపిక కూడా టాటా గ్రూప్‌లో కొనసాగింపునకు ప్రాధాన్యం ఇచ్చిన నిర్ణయమే.

1987లో TCSలో చేరిన ఆయన..సంస్థలో వివిధ స్థాయిల్లో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు.

2009లో TCS సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.అనంతరం టాటా గ్రూప్‌లో అత్యంత విలువైన కంపెనీకి నాయకత్వం వహిస్తున్న సమయంలో 2017లో టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు.

తాజా పరిణామాలతో ఇప్పుడు మరోసారి టాటా గ్రూప్‌లో అంతర్గత అభ్యర్థికే అవకాశం ఇస్తారా?లేక కొత్తగా బయటి వ్యక్తిని ఎంపిక చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT