Page Loader
Piyush Goyal: మేకిన్‌ ఇండియా'కు పదేళ్లు.. ఉద్యోగాల్లో 200శాతం గణనీయమైన పురోగతి
మేకిన్‌ ఇండియా'కు పదేళ్లు.. ఉద్యోగాల్లో 200శాతం గణనీయమైన పురోగతి

Piyush Goyal: మేకిన్‌ ఇండియా'కు పదేళ్లు.. ఉద్యోగాల్లో 200శాతం గణనీయమైన పురోగతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 25, 2024
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం అమలుచేస్తున్న 'మే కిన్‌ ఇండియా' కార్యక్రమం అమలు చేసి నేటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయెల్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. విదేశాల నుంచి మొబైల్ దిగుమతులు 85 శాతం తగ్గాయని పేర్కొన్నారు. అంతేకాకుండా తయారీ రంగంలో ఉద్యోగాల సంఖ్య పెరిగిందని కూడా వివరించారు. 2014-15లో మొబైల్ దిగుమతుల విలువ రూ.48,609 కోట్లుగా ఉండగా, 2023-24 నాటికి ఇది రూ.7,665 కోట్లకు తగ్గిందని మంత్రి తెలిపారు. 2022-24 మధ్య కాలంలో తయారీరంగంలో ఉద్యోగాలు 200 శాతం పెరిగాయన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మొబైల్స్‌లో 99 శాతం భారతదేశంలోనే తయారవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Details

వివరాలు

2014లో నరేంద్ర మోదీ ప్రారంభించిన 'మేకిన్‌ ఇండియా' కార్యక్రమం దేశీయ తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చి, ఆర్థిక వృద్ధిని పెంచిందన్నారు. భారత్‌ను గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చేందుకు దోహదం చేసిందని గోయల్ వివరించారు. వ్యాపార రంగాన్ని మెరుగుపరచడం, విదేశీ సంస్థాగత మదుపరులను ఆకర్షించడం వంటి విషయంలో ప్రభుత్వ పురోగతి ఉన్నట్లు ఆయన చెప్పారు. 2047 నాటికి వికసిత భారత్‌గా మారేందుకు 'మేకిన్‌ ఇండియా' బలమైన పునాదిని వేసిందని గోయల్ అభిప్రాయపడ్డారు.