Loading...
Tesla: సైబర్‌ ట్రక్‌ బుకింగ్‌ డబ్బులు వాపస్‌...ఉత్పిత్తి ఆగిపోవడం వెనుక అసలు కారణం ఇదే..
సైబర్‌ ట్రక్‌ బుకింగ్‌ డబ్బులు వాపస్‌...ఉత్పిత్తి ఆగిపోవడం వెనుక అసలు కారణం ఇదే

Tesla: సైబర్‌ ట్రక్‌ బుకింగ్‌ డబ్బులు వాపస్‌...ఉత్పిత్తి ఆగిపోవడం వెనుక అసలు కారణం ఇదే..

వ్రాసిన వారు Balachander Sharma
Nov 09, 2026
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలాన్‌ మస్క్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన Tesla Cybertruck ప్రయాణం త్వరలో ముగియనుంది. ఈ పికప్‌ ట్రక్‌ ఉత్పత్తిని మరో ఎనిమిది నెలల్లో నిలిపివేయాలని టెస్లా యోచిస్తోంది. ఇప్పటికే బుకింగ్‌ చేసుకున్న చాలామంది కస్టమర్లకు డిపాజిట్‌ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి వస్తుందని మస్క్‌ వెల్లడించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆర్డర్లు ఉత్పత్తి సామర్థ్యాన్ని మించిపోయాయని ఆయనే చెబుతున్నారు. అయినప్పటికీ తయారీని ఆపాలని నిర్ణయించడం వెనుక మరో వ్యూహం ఉంది.

Details

Cybercab కోసం ఉత్పత్తి లైన్‌ మార్పు

టెక్సాస్‌లోని టెస్లా ఫ్యాక్టరీలో ప్రస్తుతం సైబర్‌ట్రక్‌ తయారవుతోంది. ఈ ఉత్పత్తి లైన్‌ను మూసివేసి, అక్కడి వనరులను పూర్తిగా డ్రైవర్‌ అవసరం లేని Cybercab తయారీకి మళ్లించాలని కంపెనీ భావిస్తోంది.

పెండింగ్‌ ఆర్డర్లను పూర్తి చేసేందుకు అదనపు షిఫ్ట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు మస్క్‌ గత వారం ప్రకటించారు.

సుమారు 2027 మధ్య నాటికి సైబర్‌ట్రక్‌ తయారీ నిలిచిపోయే అవకాశం ఉంది.

Details

నష్టాల వల్ల కాదు.. మస్క్‌ వివరణ ఇదే!

సైబర్‌ట్రక్‌ లాభాలు ఇవ్వడం లేదనే ప్రచారాన్ని మస్క్‌ ఖండించారు.

ఈ వాహనం తయారీ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటంతో, అదే సామర్థ్యాన్ని ఉపయోగించి ఎక్కువ Cybercab వాహనాలను తయారు చేయడం కంపెనీకి మరింత ప్రయోజనకరమని వివరించారు.

2019 నవంబర్‌లో సైబర్‌ట్రక్‌ను ఆవిష్కరించిన టెస్లా.. 2023 నవంబర్‌లో డెలివరీలు ప్రారంభించింది.

అయితే 2024లో ఏడాదికి 2.5 లక్షల వాహనాలు విక్రయించాలన్న మస్క్‌ అంచనాలకు వాస్తవ అమ్మకాలు దూరంగా నిలిచాయి. Kelley Blue Book ప్రకారం, గత ఏడాది అమెరికాలో అమ్మకాలు 48 శాతం తగ్గి 20,237 యూనిట్లకు చేరాయి.

ADVERTISEMENT

Details

Cybercabపై టెస్లా భారీ ఆశలు

2024 అక్టోబర్‌లో పరిచయం చేసిన Cybercabలో స్టీరింగ్‌ వీల్‌, పెడల్స్‌ ఉండవు.

ఇద్దరు ప్రయాణించగల ఈ ఆటోనమస్‌ ఎలక్ట్రిక్‌ వాహనంతో రోబోటాక్సీ సేవలను విస్తరించాలని మస్క్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు.

సైబర్‌ట్రక్‌ స్థానంలో Cybercabకు ప్రాధాన్యం ఇవ్వడం టెస్లా భవిష్యత్‌ వ్యూహంలో కీలక మార్పుగా కనిపిస్తోంది.

ADVERTISEMENT