Tata-Tesla: సెమీ కండక్టర్ల సరఫరా కోసం టాటా ఎలక్ట్రానిక్స్ తో టెస్లా ఒప్పందం
సెమీ కండక్టర్ల సరఫరా కోసం అమెరికాకు చెందిన విద్యు త్ వాహన సంస్థ టెస్లా (Tesla) ప్రతిష్టాత్మక టాటా (Tata) ఎలక్ట్రానిక్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇండియాలో సెమీ కండక్టర్ల ఉత్పత్తి, విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఈ ఒ ప్పందం కీలక పాత్ర పోషించే అవకాశముంది. ఇండియాలో టెస్లా ప్లాంట్ల ఏర్పాటు ఈ ఒప్పందంలో ప్రధానంశంగా ఉంది. ఈ నేపథ్యంలో టెస్లా సీఈవో ఎలన్ మస్క్ త్వరలోనే ఇండియాకు రానున్నారు. ఎలన్ మస్క్ భారత్ కు వచ్చి ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అవుతానని ఈనెల 10న ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇండియాలో ఎలక్ట్రానిక్ వాహనాలను భారీగా ఉత్పత్తి చేసేందుకు టెస్లా సంస్థ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.
ఇండియాలో సంస్థ విస్తరణకు టెస్లా ఆసక్తి
రెండు బిలియన్ డాలర్ల వ్యయంతో భారత్ లో టెస్లా ప్లాంట్ ను నెలకొల్పేందుకు ఇప్పటికే ఆ సంస్థ ముందుకొచ్చింది. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎలక్ట్రానిక్ పాలసీ టెస్లా సంస్థ విస్తరణ ప్రణాళికలకు ఎంతో ఉపయోగపడుతుందని అంచనా. ఈ విధానంలో దేశంలో కనీసం 500 మిలియన్ డాలర్ల వ్యయంతో పెట్టుబడులు పెట్టి సంస్థలకు, అవి తయారు చేసే ప్రత్యేక మోడల్ వాహనాలకు దిగుమతి సుంకాన్ని 100 శాతం నుంచి 15శాతంకు భారత ప్రభుత్వం తగ్గించింది. దీంతో ఇండియాలో టెస్లా విస్తరణకు ఆ సంస్థ ఆసక్తి చూపుతోంది.