తదుపరి వార్తా కథనం

Thailand: ఇండియన్ ట్రావెలర్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చే నెల 1 నుంచి అందుబాటులోకి థాయ్‌లాండ్ ఈ-వీసా
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 12, 2024
12:14 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్లకు థాయిలాండ్ ఈ-వీసా వచ్చే నెల 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.
ప్రస్తుతం ఇండియన్ ట్రావెలర్స్‌కు అందిస్తున్న 60 రోజుల వీసా మినహాయింపు నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది.
న్యూఢిల్లీలోని రాయల్ థాయ్ ఎంబసీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాలను తెలియజేసింది.
అన్ని రకాల వీసాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియను https://www.thaievisa.go.th వెబ్‌సైట్ ద్వారా పూర్తి చేసుకోవచ్చని, వీసా రుసుము తిరిగి చెల్లించబడదని పేర్కొంది.
వీసా రుసుము చెల్లించిన తేదీ నుంచి సుమారు 14 రోజుల్లో ప్రాసెసింగ్ పూర్తవుతుందని సమాచారం అందించింది.
మీరు పూర్తి చేశారు