
Netherlands Recession: నెదర్లాండ్స్‌లో ఆర్థిక మాంద్యం; ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం
ఈ వార్తాకథనం ఏంటి
నెదర్లాండ్స్ ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించింది. 2023లో క్యూ2లో స్థూల దేశీయోత్పత్తి 0.3శాతం క్షీణించినట్లు ఆ దేశ గణాంకాల కార్యాలయం బుధవారం తెలిపింది.
క్యూ1లో నెదర్లాండ్స్ స్థూల దేశీయోత్పత్తి 0.4% క్షీణతను నమోదు చేసింది. దీంతో వరుసగా రెండు త్రైమాసికాల్లోనూ ఆర్థిక వృద్ధిరేటు క్షీణతను నమోదు చేయడం గమనార్హం.
కరోనా నేపథ్యంలో నెదర్లాండ్స్ ఆర్థిక వృద్ధి 2021, 2022లో సంవత్సరానికి దాదాపు 5శాతం చొప్పున నమోదైంది.
కరోనా తర్వాత వినియోగదారుల వ్యయం, ఎగుమతుల తగ్గుదలు భారీగా తగ్గిపోయాయి. ద్రవ్యోల్బణం కూడా పెరిగింది.
దీంతో ఆహార, ఇంధన ధరలు కూడా పెరగడంతో వినియోగదారులు కొనుగోలును చాలా వరకు తగ్గించేశారు.
వృద్ధిరేటు
ఐరోపా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో నెదర్లాండ్స్‌లో వినియోగదారుల వ్యయం 1.6% పడిపోయింది, ఎగుమతులు 0.7% తగ్గాయి.
అంతకుముందు సంవత్సరం సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 14.5% గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత తగ్గింది.
అయితే ఇది 2023 క్యూ2లో దాదాపు 6శాతం వద్ద ఉంది. నెదర్లాండ్స్ మాంద్యంలోకి ప్రవేశించడంతో ఐరోపా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది. ఐరోపా నెదర్లాండ్స్ అది పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.
ఇదిలా ఉంటే, ఈ ఏడాది మేలో జర్మనీ కూడా ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.