
Tim Cook: 2023లో టిమ్ కుక్ ఎన్ని వందల కోట్ల జీతం తీసుకున్నాడో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
Apple CEO Tim Cook Salary: మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద కంపెనీ ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వేతనం 2023లో భారీగా తగ్గింది.
2023లో టిమ్ కుక్ కంపెనీ నుంచి $63,209,845 ( రూ.523.83 కోట్లు) వేతనం తీసుకున్నారు.
అంతకుముందు ఏడాది.. అంటే 2022లో ఆయన $99,420,097 ( రూ.823.91 కోట్లు) అందుకున్నారు.
ఈ క్రమంలో టిమ్ కుక్ వార్షిక వేతనం రూ.300 కోట్లకు పైగా తగ్గింది.
నెలవారీగా చూసుకుంటే.. నెలకు రూ.25 కోట్లు వేతనం తగ్గడం గమనార్హం.
అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు ఆపిల్ ఇచ్చిన పత్రాల్లో సీఈవో టిమ్ కుక్ జీతం వివరాలు వెల్లడయ్యాయి.
ఆపిల్
గంటకు రూ.6 లక్షల సంపాదన
యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ మరణానంతరం కంపెనీ నిర్వహణ బాధ్యతలను టిమ్ కుక్ చూస్తున్నారు.
టిమ్ కుక్ 2023లో గంటకు రూ.6 లక్షలు సంపాదించాడు. ఇది 2022 సంవత్సరం కంటే చాలా తక్కువ.
2022 సంవత్సరంలో ఆయన ప్రతి గంటకు రూ. 9.40 లక్షలకు పైగా సంపాదించాడు.
టిమ్ కుల్ గత సంవత్సరం $ 46,970,283 అంటే మొత్తం రూ. 389.25 కోట్ల విలువైన షేర్లను కూడా అందుకున్నారు.
ఇది కాకుండా, అతను ఈక్విటీయేతర ప్రోత్సాహకంగా $10,713,450 అంటే రూ. 88.78 కోట్లు, ఇతర పరిహారంగా $2,526,112 అంటే రూ. 20.93 కోట్లను టిమ్ కుక్ పొందారు.