Tim Cook: యాపిల్ సక్సెస్ వెనుక టిమ్‌కుక్.. ఆయన ఆస్తి ఎంతో తెలుసా..?
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ దిగ్గజం ఆపిల్‌ను 15ఏళ్లుగా సీఈఓగా నడిపిస్తున్న టిమ్‌కుక్ నాయకత్వంలో సంస్థ అద్భుత వృద్ధి సాధించింది. 2011లో బాధ్యతలు చేపట్టిన తర్వాత కంపెనీ షేర్ విలువ సుమారు 20రెట్లు పెరగగా, మొత్తం మార్కెట్ విలువ నాలుగు ట్రిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా యాపిల్‌ను నిలబెట్టిన క్రమంలో టిమ్‌కుక్ వ్యక్తిగత సంపద కూడా గణనీయంగా పెరిగింది. ఫోర్బ్స్ తాజా అంచనాల ప్రకారం ఆయన నికర ఆస్తి విలువ 2.9బిలియన్ డాలర్లు (సుమారు రూ.27 వేల కోట్లు పైమాటే). ఇందులో ఎక్కువ భాగం యాపిల్ షేర్ల రూపంలోనే ఉంది. కుక్ వద్ద సుమారు 30లక్షల షేర్లు ఉన్నా, కంపెనీలో ఆయన వాటా ఒక శాతానికి తగ్గే స్థాయిలో ఉండటం గమనార్హం.
వివరాలు
కెరీర్ ప్రయాణం
టిమ్‌కుక్ 1998లో యాపిల్‌లో చేరే ముందు ఐబీఎలో 12 సంవత్సరాలు పనిచేశారు. యాపిల్‌లో ఆపరేషన్స్, సప్లై చైన్ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన, తర్వాత స్టీవ్ జాబ్స్ ఆధ్వర్యంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఎదిగారు. స్టీవ్ జాబ్స్ అనారోగ్య కారణాలతో తప్పుకోవడంతో 2011లో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.
వివరాలు
టిమ్‌కుక్ ఘనత
2025 సెప్టెంబర్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో యాపిల్ 112 బిలియన్ డాలర్ల నికర లాభాన్ని నమోదు చేసింది 2010తో పోలిస్తే ఇది సుమారు 8 రెట్లు అధికం అమెరికా-చైనా ఉద్రిక్తతల మధ్య కూడా లాభాల్లో 699% వృద్ధి సాధించింది ప్రస్తుతం యాపిల్ 23 దేశాల్లో 540కి పైగా స్టోర్లను నిర్వహిస్తోంది. వీటిలో దాదాపు 200 స్టోర్లు టిమ్‌కుక్ కాలంలోనే ప్రారంభమయ్యాయి ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌కు సుమారు 2.5 బిలియన్ యాక్టివ్ డివైజ్‌లు ఉన్నాయి. టిమ్‌కుక్ తరచూ "అధిక సంఖ్యలో ఉత్పత్తులు తయారు చేయడం కాదు, మార్పు తీసుకువచ్చే ఉత్పత్తులు రూపొందించడమే మా లక్ష్యమని పేర్కొంటుంటారు.
వివరాలు
సీఈఓ మార్పుపై చర్చ
టిమ్ కుక్ పదవి నుంచి వైదొలగనున్న నేపథ్యంలో యాపిల్‌లో హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న జాన్ టెర్నస్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇటీవల ఎన్విడియా మార్కెట్ విలువలో యాపిల్‌ను దాటగా, తాజా పరిణామాల నేపథ్యంలో యాపిల్ షేర్ ధర ఒక శాతానికి పైగా పెరిగింది. మొత్తంగా టిమ్‌కుక్ నాయకత్వంలో యాపిల్ విశేష వృద్ధి సాధించగా, ఆయన వ్యక్తిగత సంపద కూడా అదే స్థాయిలో పెరిగినట్లు స్పష్టమవుతోంది.