LOADING...
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్క రోజులోనే భారీ జంప్
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్క రోజులోనే భారీ జంప్

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్క రోజులోనే భారీ జంప్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 04, 2026
03:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొన్ని రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు తాజాగా ఒక్కసారిగా మళ్లీ ఎగిశాయి. ఇటీవల పసిడి ధరలు క్రమంగా తగ్గుతుండటంతో కొనుగోలుదారులు, ముఖ్యంగా మహిళలు కొంత ఊరట పొందుతుండగా, తాజా పెరుగుదల వారికి షాక్ ఇచ్చింది. ఒక్క రోజులోనే తులం బంగారం ధర రూ.3 వేలకుపైగా పెరగగా, కిలో వెండి ధర కూడా సుమారు రూ.5 వేల మేర ఎగబాకింది. జూలై 4 నాటికి నమోదైన ధరల ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఇలా ఉన్నాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రోజంతా ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అవి పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా యథాతథంగా కొనసాగవచ్చు.

వివరాలు

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,010గా నమోదైంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,760గా ఉంది. విజయవాడ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,010 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,760గా కొనసాగుతోంది. ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,160గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,910గా నమోదైంది. ముంబై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,010గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,760గా ఉంది.

వివరాలు

వెండి ధరలు ఇలా..

వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ నగరాల్లో కిలో వెండి ధర రూ.2,60,100గా నమోదైంది. మరోవైపు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.2,50,100 వద్ద ట్రేడవుతోంది.

Advertisement