Loading...
Gold Price Today: మహిళలకి గుడ్ న్యూస్.. బంగారం,వెండి ధరల్లో భారీ పతనం
మహిళలకి గుడ్ న్యూస్.. బంగారం,వెండి ధరల్లో భారీ పతనం

Gold Price Today: మహిళలకి గుడ్ న్యూస్.. బంగారం,వెండి ధరల్లో భారీ పతనం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2026
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం,వెండి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వరుసగా ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బంగారం ధరలు రెండు రోజుల్లోనే భారీగా పడిపోయాయి. తులం బంగారంపై దాదాపు రూ.2 వేల వరకు తగ్గుదల నమోదైంది. వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. రెండు రోజుల్లోనే కిలో వెండిపై సుమారు రూ.6 వేల వరకు తగ్గింది. అక్టోబర్ 24న ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. మార్కెట్ పరిస్థితులను బట్టి రోజులో ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

వివరాలు 

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు

హైదరాబాద్: నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,470గా ఉంది. అదే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,590 వద్ద కొనసాగుతోంది.

విజయవాడ: ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,470 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,590గా నమోదైంది.

ఢిల్లీ: దేశ రాజధానిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,620గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,740 వద్ద కొనసాగుతోంది.

ముంబై: ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,470గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,590గా ఉంది.

వివరాలు 

భారీగా తగ్గిన వెండి ధర

బెంగళూరు: నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,470 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,590 వద్ద కొనసాగుతోంది.

చెన్నై: చెన్నైలో కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,470గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,590గా నమోదైంది.

బంగారంతో పాటు వెండి ధర కూడా గణనీయంగా తగ్గింది. కేవలం రెండు రోజుల్లోనే కిలో వెండిపై దాదాపు రూ.6 వేల వరకు తగ్గుదల నమోదైంది.

తాజా ధరల ప్రకారం కిలో వెండి రూ.2,19,900 వద్ద ట్రేడవుతోంది. బంగారం, వెండి ధరల్లో చోటుచేసుకుంటున్న ఈ మార్పులు కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ADVERTISEMENT