
Pharma Stocks Crash: ఫార్మా ఉత్పత్తులపై ట్రంప్ సుంకాల ప్రకటన.. భారీ నష్టాల్లో ఫార్మా స్టాక్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిన్నటి ట్రేడింగ్ సెషన్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఫార్మా స్టాక్స్ నేడు నష్టాల్లోకి కూరుకుపోయాయి.
దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటన. ఫార్మా ఉత్పత్తులపై త్వరలో సుంకాలు విధిస్తానని ఆయన వెల్లడించడంతో, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 4.2 శాతం పడిపోయింది.
ఇంట్రాడేలో ఈ సూచీ 20,521.70 వద్ద కనిష్ఠాన్ని తాకింది.
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై ఇప్పటికే సుంకాలను విధించిన ట్రంప్ తాజాగా ఫార్మా ఉత్పత్తులు, సెమీ కండక్టర్లపై కూడా పన్ను విధించనున్నట్లు తెలిపారు.
Details
నష్టాల్లో అరబిందో ఫార్మా, లుపిన్
ఫార్మా రంగం ప్రత్యేకమైనదని పేర్కొన్న ఆయన, ఈ రంగంపై టారిఫ్ విధింపును పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు వెల్లడించారు.
ట్రంప్ తాజా వ్యాఖ్యల ప్రభావంతో, నిన్న సుస్థిరంగా కొనసాగిన ఔషధ రంగ స్టాక్స్ ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి.
అరబిందో ఫార్మా 6.25 శాతం, ఐపీసీఏ లేబొరేటరీస్ 6.51 శాతం, లుపిన్ 5.35 శాతం, బయోకాన్ 5.05 శాతం నష్టపోయాయి.
సిప్లా, దివీస్ లేబొరేటరీస్, డాక్టర్ రెడ్డీస్, సన్‌ఫార్మా షేర్లు సుమారు 3 శాతం మేర నష్టాల్లో ట్రేడవుతున్నాయి.