
ట్విట్టర్‌లో 'ఆర్టికల్స్' ఫీచర్; ట్వీట్‌లో ఇకపై అక్షరాల లిమిట్ ఉండదు
ఈ వార్తాకథనం ఏంటి
వినియోగదారులను ఆకర్షించేందుకు ట్విట్టర్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది.
ట్వీట్‌లో అక్షరాల పరిమితిని లేకుండా సుదీర్ఘ పోస్టును పెట్టేందుకు వీలుగా "ఆర్టికల్స్" అనే కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది.
కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్ ద్వారా సుధీర్ఘమైన వ్యాసాలను కూడా ట్విట్టర్‌లో పోస్టు చేయవచ్చు.
దీన్ని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కూడా ధృవీకరించారు. "ఆర్టికల్స్" ఫీచర్‌ను అందుబాటులోకి వస్తే, ట్విట్‌లో ఒక పుస్తకంతో సమానమైన కంటెంట్‌ను కూడా పోస్టు చేయొచ్చని మస్క్ వెల్లడించారు.
ప్రస్తుతం ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రైబర్‌లు 10,000అక్షరాల వరకు ఉన్న ట్వీట్‌లను ప్రచురించడానికి అనుమతిస్తుంది.
బ్లూ టిక్ లేని వారికి 280అక్షరాల పరిమితిని ట్విట్టర్ విధించింది. ఇప్పుడు ఆర్టికల్స్ ఫీచర్ అందుబాటులోకి వస్తే, ఇక ఎలాంటి అక్షరాల పరిమితి ఉండదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ట్విట్టర్‌లో అక్షరాల పరిమితికి ఇక స్వస్తి
Elon Musk says Twitter’s new feature will soon let you publish articleshttps://t.co/6EShUv830M
— Insider Paper (@TheInsiderPaper) July 19, 2023