LOADING...
Gold Rate Today: రెండు రోజుల ఆనందానికి బ్రేక్.. బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్!
రెండు రోజుల ఆనందానికి బ్రేక్.. బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్!

Gold Rate Today: రెండు రోజుల ఆనందానికి బ్రేక్.. బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 16, 2025
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

గోల్డ్ రేట్లు తగ్గిన ఆనందం మహిళలకు కేవలం రెండు రోజులు కూడా మిగలలేదు. వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు మే 16 శుక్రవారం ఒక్కసారిగా పెరిగిపోయాయి. బులియన్ మార్కెట్ తాజా గణాంకాల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,200 పెరగ్గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,100 మేర పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,200గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,130గా నమోదైంది. ఈ ధరలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో కూడా వర్తిస్తున్నాయి. అయితే వెండి మాత్రం కొంత ఊరటను అందిస్తోంది.

Details

కిలో వెండి ధర రూ.97వేలు

ఇటీవల వెండి ధరలు స్థిరంగా ఉండడం లేదా స్వల్పంగా తగ్గుతుండటం గమనార్హం. నిన్నటి రోజున వెండి ధర రూ.900 తగ్గినప్పటికీ, నేడు అది స్థిరంగా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్ ప్రకారం, కిలో వెండి ధర రూ.97,000గా ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కిలో వెండి ధర రూ.1,08,000గా కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో వెండి ధరలు రూ.97,000గా ఉన్నాయి. ప్రాంతానుసారంగా బంగారం, వెండి ధరల్లో తేడాలు ఉండటం సాధారణమే. నేటి ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఇలానే ఉన్నాయి.