NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / బ్రిటన్‌కు ఉపయోగపడే వాణిజ్య ఒప్పందాన్ని మాత్రమే భారత్‌తో అంగీకరిస్తా: రిషి సునక్ 
    తదుపరి వార్తా కథనం
    బ్రిటన్‌కు ఉపయోగపడే వాణిజ్య ఒప్పందాన్ని మాత్రమే భారత్‌తో అంగీకరిస్తా: రిషి సునక్ 
    బ్రిటన్‌కు ఉపయోగపడే వాణిజ్య ఒప్పందాన్ని మాత్రమే భారత్‌తో అంగీకరిస్తా: రిషి సునక్

    బ్రిటన్‌కు ఉపయోగపడే వాణిజ్య ఒప్పందాన్ని మాత్రమే భారత్‌తో అంగీకరిస్తా: రిషి సునక్ 

    వ్రాసిన వారు Stalin
    Sep 06, 2023
    02:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌తో జరిగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) చర్చలపై బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలు పురోగతిలో ఉన్నాయని చెప్పారు.

    యూకే మొత్తానికి ఉపయోగపడే ఒప్పందానికి మాత్రమే తాను అంగీకరిస్తానని ప్రధానమంత్రి రిషి సునక్ పేర్కొన్నారు.

    ఈ వారం దిల్లీలో జరిగే జీ20 వరల్డ్ లీడర్స్ సమ్మిట్‌కు వెళ్లనున్నారు. ఈ క్రమంలో భారత్‌తో జరిగే వాణిజ్య చర్చల గురించి సునక్ తన కేబినెట్ సమావేశంలో చర్చించారు.

    ద్వైపాక్షిక సహకారంతో పాటు యూకేకు భారత్ నమ్మదగ్గ భాగస్వామి అని, ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని సునక్ ఈ సందర్భంగా చెప్పారు.

    రిషి

    భారత్-బ్రిటన్ వాణిజ్య భాగస్వామ్యం 36 బిలియన్ డాలర్లు 

    ఇప్పటికే బ్రిటన్- భారత్ మధ్య వాణిజ్య చర్చలు 12 దఫాలు జరిగాయి. గత నెలలో కూడా దిల్లీలో భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌తో యూకే వ్యాపార, వాణిజ్య కార్యదర్శి కెమీ బాడెనోచ్ చర్చలు జరిపారు.

    ఈ చర్చల సారాంశాన్ని కెమీ బాడెనోచ్ కేబినెట్‌కు వివరించారు.

    యూకే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్ అని రిషి సునక్ అన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య భాగస్వామ్యం 36 బిలియన్ డాలర్లుగా ఉందని పేర్కొన్నారు.

    భారత్‌తో వాణిజ్యం, రక్షణ, సాంకేతికత రంగాల్లో శాశ్వతమైన, బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందని సునక్ నొక్కి చెప్పారు.

    ఇరు దేశాల భాగస్వామ్యం రాబోయే దశాబ్దాలపాటు యూకే ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రిషి సునక్
    బ్రిటన్
    భారతదేశం
    వాణిజ్యం

    తాజా

    Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్! జమ్ముకశ్మీర్
    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్

    రిషి సునక్

    'నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది': రిషి సునక్‌పై సుధా మూర్తి ఆసక్తికర కామెంట్స్ బ్రిటన్
    ప్రధాని అత్తను అంటే ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లు నమ్మలేదు: సుధా మూర్తి  బ్రిటన్
    రిషి సునక్ అధికారిక నివాసం గేట్లను కారుతో ఢీకొట్టిన వ్యక్తి అరెస్టు  బ్రిటన్
    రిషి సునక్ తల్లి చేసిన 'బర్ఫీ'ని రుచి చూసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజా వార్తలు

    బ్రిటన్

    ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ: ట్వీట్లు, యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశం నరేంద్ర మోదీ
    సీటుబెల్ట్ ధరించనందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కు జరిమానా అంతర్జాతీయం
    నన్ను చంపుతానని పుతిన్ బెదిరించారు: బోరిస్ జాన్సన్ రష్యా
    ఆస్ట్రేలియా చారిత్రక నిర్ణయం, కరెన్సీపై క్వీన్ ఎలిజబెత్ చిత్రం తొలగింపు ఆస్ట్రేలియా

    భారతదేశం

    అంతరిక్ష రారాజుగా భారత్.. దక్షిణ ధ్రువంపై కాలుమోపిన ఏకైక దేశంగా రికార్డు చంద్రయాన్-3
    చంద్రయాన్ -3 మిషన్ విజయవంతం.. ఇస్రోకు శుభాకాంక్షల వెల్లువ ఇస్రో
    BRICS: బ్రిక్స్ కూటమిలో కొత్తగా 6దేశాలకు సభ్యత్వం.. స్వాగతించిన మోదీ బ్రిక్స్ సమ్మిట్
    మోదీతో జిన్‌పింగ్.. ఇండో చైనా సంబంధాలు బలపడితే ఇరు దేశాలకూ లాభమే  చైనా

    వాణిజ్యం

    డబ్ల్యూటీఓలోని 6వాణిజ్య వివాదాల పరిష్కారానికి భారత్ - అమెరికా అంగీకారం  జో బైడెన్
    PM Modi address B20: అన్ని సమస్యలకు భారత్ దగ్గరే పరిష్కారం: బీ20 సదస్సులో ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Basmati Rice: బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు  కేంద్ర ప్రభుత్వం
    కారణం చెప్పకుండానే.. భారత్‌తో వాణిజ్య చర్చలను నిలివేసిన కెనడా  కెనడా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025