Loading...
USA: భారత్‌ ఇంధన అవసరాలపై అమెరికా ఫోకస్‌.. భారీగా చమురు సరఫరాకు రెడీ!
భారత్‌ ఇంధన అవసరాలపై అమెరికా ఫోకస్‌.. భారీగా చమురు సరఫరాకు రెడీ!

USA: భారత్‌ ఇంధన అవసరాలపై అమెరికా ఫోకస్‌.. భారీగా చమురు సరఫరాకు రెడీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 26, 2026
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్‌ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడినప్పటి నుంచి ఇండియా.. ఇంధన దిగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌ అవసరాలకు (India's Energy Needs) అనుగుణంగా ఇంధనాన్ని సరఫరా చేయాలని ట్రంప్‌ యంత్రాంగం యోచిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ప్రపంచ దేశాలపై టారిఫ్‌లు, ఇంధన ఆంక్షల విషయంలో అమెరికా కఠిన వైఖరిని అనుసరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో భారత్‌కు భారీగా ఇంధన అవసరాలు ఉన్నందున.. ఆ అవకాశాన్ని తాము వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు.

వివరాలు

భారత్‌కు చమురు సరఫరాకు అమెరికా సిద్ధం

యుద్ధం కారణంగా కొన్ని నెలలపాటు ఇరాన్‌, పశ్చిమాసియా దేశాల నుంచి చమురు ఎగుమతులు నిలిచిపోవడంతో ప్రపంచ మార్కెట్‌లో ఇంధన లభ్యత పరిమితంగా ఉందని సదరు అమెరికా అధికారి పేర్కొన్నారు.

అయితే వెనెజువెలాపై ట్రంప్‌ (Donald Trump) చేపట్టిన విజయవంతమైన ఆపరేషన్‌ కారణంగా ప్రస్తుతం అమెరికా వద్ద పెద్ద మొత్తంలో చమురు నిల్వలు ఉన్నాయని ఆయన తెలిపారు.

భారత్‌ వంటి మిత్ర దేశాలకు చమురును విక్రయించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

వివరాలు

భారత్‌పై ప్రభావం చూపనున్న కొత్త చట్టం

మరోవైపు అమెరికా కాంగ్రెస్‌ ఇటీవల 'ద లిండ్సే గ్రాహమ్‌ శాంక్షనింగ్‌ రష్యా అండ్‌ ఇరాన్‌ యాక్ట్‌-2026' బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే.

ఈ బిల్లుపై ట్రంప్‌ సంతకం చేయడంతో అది చట్టరూపం దాల్చింది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షలు విధించేందుకు, ఆ దేశాలతో వాణిజ్యం కొనసాగిస్తున్న భారత్‌, చైనా వంటి దేశాలపై సుంకాలు విధించేందుకు ఈ చట్టం ద్వారా ట్రంప్‌కు అధికారం లభించినట్లైంది.

ఈ కొత్త చట్టం భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపైనా ప్రభావం చూపుతుందని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

ADVERTISEMENT