Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 315 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
శుక్రవారం ఉదయం ప్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లో స్థిరపడ్డాయి. మార్కెట్లు ముగిసే సమయానికి కీలక సూచీలు రెండూ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 315.20 పాయింట్లు లేదా 0.43 శాతం లాభపడి 73,895.74 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 77.40 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 23,140.50 వద్ద నిలిచింది.
వివరాలు
టాప్ గెయినర్స్
శుక్రవారం ట్రేడింగ్‌లో వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్, హెచ్‌ఈజీ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చోటు సంపాదించాయి.
నష్టాల్లో ఈ స్టాక్స్
ఇక ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్, జేకే సిమెంట్ లిమిటెడ్, మాక్స్ హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
దీంతో ఈ కంపెనీలు శుక్రవారం ట్రేడింగ్‌లో లూజర్స్ జాబితాలో నిలిచాయి.