Cognizant,Cloudera: కాగ్నిజెంట్, క్లౌడెరాకు భారీ షాక్.. అమెరికాలో పీఈఆర్‌ఎం ఫైలింగ్స్ నిలిపివేత
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ (Cognizant), డేటా మేనేజ్‌మెంట్ రంగంలో పేరున్న క్లౌడెరా (Cloudera)కు అమెరికాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. గ్రీన్‌కార్డు పొందేందుకు అవసరమైన శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ (Permanent Labor Certification)కు సంబంధించిన పీఈఆర్‌ఎం (PERM) ఫైలింగ్స్‌ను అమెరికా నిలిపివేసింది. కాగ్నిజెంట్, క్లౌడెరాకు సంబంధించిన పీఈఆర్‌ఎం ప్రక్రియను సస్పెండ్ చేసినట్లు అమెరికా కార్మికశాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోని వెల్లడించారు. ఈ రెండు సంస్థల ఉద్యోగులకు ఎలాంటి ముప్పు వాటిల్లినా సహించబోమని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
కాగ్నిజెంట్, క్లౌడెరాపై దర్యాప్తు
వైట్‌హౌజ్ ఫ్రాడ్ టాస్క్‌ఫోర్స్‌తో కలిసి కాగ్నిజెంట్, క్లౌడెరాపై దర్యాప్తు చేపట్టినట్లు ఆంథోని తెలిపారు.
ప్రస్తుతం విచారణ ముమ్మరంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో సంస్థలకు సంబంధించిన వాస్తవాలతో పాటు ఆర్థిక మోసాలకు సంబంధించిన అంశాలపైనా అధికారులు ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు.