Vodafone Idea: విదేశాలకు వెళ్లే వారికి వొడాఫోన్ ఐడియా గుడ్‌న్యూస్.. ఇంటర్నేషనల్ రోమింగ్ ఫ్రీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (VI) తమ చందాదారుల కోసం కొత్త ప్రయోజనాన్ని ప్రకటించింది. ఎంపిక చేసిన పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్, ఎంటర్‌ప్రైజ్ ప్లాన్లతో ఇంటర్నేషనల్ రోమింగ్ సదుపాయాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్‌తో ప్రత్యేకంగా రోమింగ్ ఛార్జీలు చెల్లించకుండానే 170కిపైగా దేశాల్లో సేవలను వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఏడాదికి మూడు విదేశీ ప్రయాణాల వరకు.. VI ప్రకటించిన ఈ సదుపాయం ద్వారా వినియోగదారులు ఏడాదిలో గరిష్ఠంగా మూడు విదేశీ ట్రిప్పుల సమయంలో ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్ ప్రయోజనాన్ని పొందొచ్చు. దీని ద్వారా ఏడాదికి రూ.9 వేల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.
వివరాలు
సాధారణంగా విదేశాలకు వెళ్లినప్పుడు..
విదేశీ ప్రయాణాలు చేసే సమయంలో చాలామంది తమ దేశీయ సిమ్‌ను తీసేసి, వెళ్లిన దేశంలో స్థానిక సిమ్‌ను ఉపయోగిస్తుంటారు.
మరికొందరు తమ మొబైల్ నంబర్‌కు వచ్చే ఇన్‌కమింగ్ కాల్స్, ఓటీపీలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకుంటారు.
అయితే VI తీసుకొచ్చిన ఈ ప్రయోజనంతో అర్హత ఉన్న వినియోగదారులు విదేశాల్లో ఉన్నప్పటికీ తమ ప్రస్తుత మొబైల్ నంబర్‌ను కొనసాగించవచ్చు.
దీంతో కాల్స్, ఓటీపీల కోసం సిమ్ మార్చాల్సిన అవసరం ఉండదు.
వివరాలు
ఎవరెవరికి ఈ సదుపాయం?
రూ.501 కంటే ఎక్కువ విలువ కలిగిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ఉపయోగిస్తున్న కస్టమర్లు ఈ ఉచిత రోమింగ్ ప్రయోజనానికి అర్హులని VI తెలిపింది.
అలాగే వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లు తీసుకున్న వినియోగదారులు, రూ.451 నుంచి ప్రారంభమయ్యే ఎంటర్‌ప్రైజ్ ప్లాన్లను వినియోగిస్తున్న కస్టమర్లు కూడా ఈ సదుపాయాన్ని పొందవచ్చని పేర్కొంది.
VI యాప్‌తో యాక్టివేట్..
అర్హత ఉన్న వినియోగదారులు వీఐ యాప్ ద్వారా ఈ ఫ్రీ రోమింగ్ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.
అయితే అందుబాటులో ఉండే ప్రయోజనాలు వినియోగిస్తున్న ప్యాకేజీని బట్టి మారుతాయని తెలిపింది.
ప్లాన్‌ను బట్టి ఇంటర్నేషనల్ డేటా, ఔట్‌గోయింగ్ కాలింగ్ వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయని పేర్కొంది.