Loading...
Vijay Mallya: నాకు న్యాయం జరగడం లేదు.. బ్యాంకుల రికవరీపై విజయ్ మాల్యా వ్యాఖ్యలు
నాకు న్యాయం జరగడం లేదు.. బ్యాంకుల రికవరీపై విజయ్ మాల్యా వ్యాఖ్యలు

Vijay Mallya: నాకు న్యాయం జరగడం లేదు.. బ్యాంకుల రికవరీపై విజయ్ మాల్యా వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 27, 2026
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి.. దేశం విడిచి బ్రిటన్‌లో ఉంటున్న విజయ్ మాల్యా మరోసారి రుణాల వసూళ్లు, న్యాయం అంశంపై స్పందించారు. బ్యాంకులు తన నుంచి బకాయిల కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసినప్పటికీ తనకు న్యాయం జరగలేదని వ్యాఖ్యానించారు. జాతీయ మీడియాలో ప్రచురితమైన ఓ కథనాన్ని ప్రస్తావిస్తూ ఎక్స్‌ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.

వివరాలు 

రూ.22 వేల కోట్ల రుణం.. రూ.6.5 కోట్లతో పరిష్కారం?

మీడియారంగ ప్రముఖుడు, జీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సుభాష్ చంద్ర బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.22,006.57 కోట్ల రుణాలను కేవలం రూ.6.5 కోట్ల చెల్లింపుతో పరిష్కరించుకునేందుకు అవకాశం లభించిందని జాతీయ మీడియాలో ఓ కథనం వెలువడింది.

దానిపై మాల్యా స్పందిస్తూ.. ''ఇదే నిజమైతే.. నా స్నేహితుడు సుభాష్‌కు అభినందనలు.

''రూ.6,203 కోట్ల రుణానికి సంబంధించి నా నుంచి రూ.14,100 కోట్లు వసూలు చేసినట్లు బ్యాంకులు, ప్రభుత్వం అంగీకరించాయి. అదే సమయంలో చాలామంది రుణగ్రహీతలు తక్కువ మొత్తాలు చెల్లించి తమ అప్పులను పరిష్కరించుకుంటున్నారు. బహుశా భారత రుణ పరిష్కార న్యాయం ఇదేనేమో. ఇంత జరుగుతున్నా మీడియా నుంచి ఎలాంటి ప్రశ్నలు లేవు'' అంటూ వ్యాఖ్యానించారు.

వివరాలు 

రికవరీ కేవలం 0.03 శాతమే..

సుభాష్ చంద్రకు సంబంధించిన రూ.22 వేల కోట్ల రుణాల పరిష్కారానికి జాతీయ కంపెనీ చట్టాల ట్రైబ్యునల్ (NCLT) ఆమోదం తెలిపింది.

మొత్తం బకాయిల్లో రూ.6.5 కోట్ల చెల్లింపు అంటే.. దాదాపు 0.03 శాతం మాత్రమే రికవరీ అవుతుంది.

దీని ప్రకారం రుణదాతలకు 99.97 శాతం మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

సుభాష్ చంద్ర వ్యక్తిగత హామీదారుగా ఉన్న రుణాలపై ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రారంభించిన దివాలా ప్రక్రియలో భాగంగానే ఈ పరిష్కారానికి NCLT ఆమోదం లభించింది.

ADVERTISEMENT

వివరాలు 

కింగ్‌ఫిషర్ రుణాలపైనా మాల్యా విమర్శలు

ఇదిలా ఉండగా.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన రుణాల విషయంలోనూ మాల్యా బ్యాంకులపై విమర్శలు చేశారు.

తన నుంచి తీసుకున్న రుణాల కంటే పలు రెట్లు అధికంగా బ్యాంకులు వసూలు చేశాయని ఆరోపించారు.

రికవరీకి సంబంధించిన పూర్తి వివరాలు, స్టేట్‌మెంట్లు అందించాలని కోరుతూ మాల్యా గత ఏడాది కర్ణాటక హైకోర్టును కూడా ఆశ్రయించారు.

తన రుణాల విషయంలో జరిగిన వసూళ్లకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఆయన కోరారు.

ADVERTISEMENT