Lenskart: లెన్స్‌కార్ట్‌లో మత గుర్తుల వివాదం: వైరల్ వార్తలపై సీఈఓ వివరణ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ కళ్లజోళ్ల విక్రయ సంస్థ లెన్స్‌కార్ట్(Lenskart)తన సిబ్బంది మతపరమైన గుర్తులు ధరించవద్దని ఆదేశించిందంటూ ఒక సర్క్యులర్ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం పొందింది. ఈ విషయం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దీనిపై సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ పీయూశ్ బన్సల్ (Peyush Bansal) స్పందించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? లెన్స్‌కార్ట్ సిబ్బంది స్టైల్ గైడ్ అంటూ నెట్టింట్లో కొన్ని పాయింట్లు వైరల్ అయ్యాయి. వాటి ప్రకారం, సంస్థ దుకాణాల్లో పనిచేసే సిబ్బంది నలుపు రంగు హెడ్‌స్కార్ఫ్, తలపాగాలు ధరించడానికి అనుమతి ఉందని, అయితే తిలకం, బిందీ వంటి గుర్తులు ధరించడానికి అనుమతి లేదని పేర్కొన్నట్లు తెలిపింది. ఈ పాయింట్లు నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
వివరాలు
క్షమాపణలు తెలిపిన సీఈఓ పీయూశ్ బన్సల్
మతపరమైన పక్షపాతం చూపిస్తున్నారంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఈ వ్యవహారంపై బన్సల్ ఎక్స్ వేదికగా స్పష్టత ఇచ్చారు. సంస్థపై జరుగుతున్న ప్రచారం అసత్యమని ఆయన స్పష్టం చేశారు. బిందీ, తిలకం వంటి మతపరమైన వ్యక్తీకరణలపై ఎలాంటి నిషేధాలు తమ సంస్థలో లేవని తెలిపారు. సంస్థ మార్గదర్శకాలను కాలానుగుణంగా పునఃసమీక్షిస్తామని, పాత నిబంధనలు ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించకపోవచ్చని వివరించారు. ఈ గందరగోళానికి క్షమాపణలు కూడా తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సీఈఓ పీయూశ్ బన్సల్ చేసిన ట్వీట్
I have listened to your concerns and I understand your sentiment around this. I want to add more context to my earlier post.
— Peyush Bansal (@peyushbansal) April 16, 2026
The document currently circulating is an outdated internal training document. It is not an HR policy.
That said, it contained an incorrect line about…