Page Loader
వేమో, జనరల్ మోటార్స్, సిటీ గ్రూప్ తో పాటు మరికొన్ని సంస్థలు ప్రారంభించిన ఉద్యోగ కోతలు
2023 లో ఫైనాన్స్, టెక్, ఆటోమోటివ్‌ రంగాలలో ఉద్యోగ కోతలు

వేమో, జనరల్ మోటార్స్, సిటీ గ్రూప్ తో పాటు మరికొన్ని సంస్థలు ప్రారంభించిన ఉద్యోగ కోతలు

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 03, 2023
05:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

వేమో, జనరల్ మోటార్స్, సిటీ గ్రూప్ తో పాటు మరికొన్ని సంస్థలు ఉద్యోగ కోతలు ప్రారంభించాయి. 2022 సంవత్సరంలో మొదలైన ఉద్యోగుల తొలగింపుల సీజన్ 2023లో కూడా కొనసాగుతుంది. ఇంకా సంవత్సరంలో మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే కొన్ని వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2022కి భిన్నంగా, ఈ సంవత్సరం ఫైనాన్స్, టెక్, ఆటోమోటివ్‌తో సహా రంగాలలోని ఉద్యోగులు ప్రభావితమయ్యారు. తాజాగా సిటీ గ్రూప్, జనరల్ మోటార్స్, ఆల్ఫాబెట్స్ వేమో, Yellow.ai, థాట్‌వర్క్స్ ఆ లిస్ట్ లో చేరాయి. ప్రస్తుత ఆర్థిక వాతావరణంలో కంపెనీలకు ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ తొలగింపులు సులభమైన మార్గంగా కనిపిస్తున్నాయి.

ఉద్యోగులు

జనరల్ మోటార్స్ తన ఖర్చులను 2 బిలియన్ డాలర్లు తగ్గించుకోవాలని ఆలోచిస్తుంది

సిటీ గ్రూప్ తన సిబ్బందిలో 1% కంటే తక్కువ మందిని తొలగిస్తుంది. ఖర్చులను తగ్గించే ప్రయత్నంలో, జనరల్ మోటార్స్ దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. కంపెనీ తన ఖర్చులను 2 బిలియన్ డాలర్లు తగ్గించుకోవాలని ఆలోచిస్తుంది. వేమో, ఆల్ఫాబెట్ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ యూనిట్, ఈ సంవత్సరం రెండవ రౌండ్ ఉద్యోగ కోతలను ప్రకటించింది. కంపెనీ 137 మంది ఉద్యోగులను తొలగించింది, మొత్తం తొలగించిన ఉద్యోగుల శాతం 8%కి చేరుకుంది. AI స్టార్ట్-అప్ Yellow.ai నవంబర్, జనవరి మధ్య ఉద్యోగులలో 15% మందిని తొలగించింది చికాగోకు చెందిన సాఫ్ట్‌వేర్ కన్సల్టెన్సీ సంస్థ థాట్‌వర్క్స్ తన సిబ్బందిలో 4% అంటే 500 మంది ఉద్యోగులను తొలగించింది.