
Foreign Trade Policy: విదేశీ వర్తక విధానం అంటే ఏంటి..? ఎన్ని రకాలున్నాయి?
ఈ వార్తాకథనం ఏంటి
ఒక దేశంలోని ప్రజలు,కంపెనీలు, ప్రభుత్వం ఇతర దేశాల ప్రజలు,సంస్థలు, ప్రభుత్వాలతో చేసే వ్యాపార లావాదేవీలను అంతర్జాతీయ వ్యాపారం అంటారు.
ఈ అంతర్జాతీయ వ్యాపారంలో ముఖ్యంగా ఎగుమతులు,దిగుమతులు జరుగుతుంటాయి.
మన దేశంలో తయారైన వస్తువులను ఇతర దేశాలకు విక్రయించడాన్ని ఎగుమతి అంటారు.
అలాగే, ఇతర దేశాలలో తయారైన వస్తువులను మన దేశ ప్రజలు కొనుగోలు చేయడాన్ని దిగుమతి అంటారు.
ఏదైనా దేశం తన విదేశీ వ్యాపారానికి సంబంధించి అమలు చేసే విధానాలు, నియమాలు, ఆంక్షలు వంటివన్నీ కలిపి వర్తక విధానంగా పేర్కొంటారు.
సాధారణంగా, ప్రభుత్వం అనుసరించే వ్యాపార విధానాలు రెండు ప్రధాన రకాలుగా ఉంటాయి..
1. స్వేచ్ఛా వ్యాపార విధానం, 2. రక్షణాత్మక వ్యాపార విధానం
#1
స్వేచ్ఛా వాణిజ్య విధానం
ఏదైనా దేశం ఇతర దేశాల నుండి వస్తున్న దిగుమతులపై ఎటువంటి సుంకాలు,పరిమితులు, నియంత్రణలు లేకుండా.. అలాగే ఎగుమతులపై ప్రోత్సాహకాలు లేదా సుంకాలు లేకుండా వాణిజ్యాన్ని సాగిస్తే, దానిని స్వేచ్ఛా వాణిజ్య విధానంగా పేర్కొంటారు. # 2రక్షణాత్మక వాణిజ్య విధానం
ఇది స్వేచ్ఛా వాణిజ్య విధానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఇందులో విదేశాల నుండి దిగుమతులపై ఆంక్షలు విధించడం లేదా దేశీయ పరిశ్రమలను ఉత్సాహపరిచే విధంగా సబ్సిడీలు అందించడం ద్వారా దేశీయ పరిశ్రమలకు రక్షణ కల్పించబడుతుంది. ప్రారంభ దశలో ఉన్న పరిశ్రమలను అభివృద్ధి చేయడం, దేశ రక్షణను బలపరచడం, ఉపాధి అవకాశాలను పెంచడం వంటి లక్ష్యాలతో ఈ విధానాన్ని అనుసరిస్తారు.
రకరకాల ఆంక్షలు
దిగుమతులపై రకరకాల ఆంక్షలు విధించవచ్చు.. ఇవి రెండు ప్రధాన వర్గాల్లో ఉంటాయి
టారిఫ్ (సుంక) ఆంక్షలు: దిగుమతులపై అధిక పన్నులను విధించడం.
సుంకాలేతర ఆంక్షలు (నాన్-టారిఫ్ బారియర్స్): పన్నుల రూపంలో కాకుండా, దిగుమతుల పరిమాణంపై నేరుగా పరిమితులు విధించడం. వీటిని పరిమాణాత్మక నియంత్రణలు లేదా కోటాలు అని కూడా అంటారు.
రెండు విధానాల ప్రభావం
స్వేచ్ఛా వాణిజ్య విధానం వల్ల అంతర్జాతీయ వ్యాపారం విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది.
ఇక రక్షణాత్మక విధానాన్ని అమలు చేస్తే, వ్యాపారం పరిమితమవుతుంది. ప్రస్తుతానికైతే, చాలా దేశాలు రక్షణ విధానాన్ని ఓ మోతాదులో కొనసాగిస్తున్నాయి.
వివరాలు
1991 వరకు దిగుమతులకు ప్రత్యామ్నాయ విధానం
ఈ పరిస్థితుల్లో, కొన్ని దేశాలు పరస్పరం స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతాలు (Free Trade Zones) ఏర్పాటు చేస్తున్నాయి.
స్వేచ్ఛా వాణిజ్య విధానం ప్రపంచ స్థాయి అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంటే, రక్షణాత్మక విధానం మాత్రం స్థానిక పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుంది.
భారత్ విషయానికి వస్తే, 1991 వరకు దిగుమతులకు ప్రత్యామ్నాయ విధానాన్ని (Import Substitution Policy) అనుసరించింది.
అంటే, భారత్ అప్పటివరకు 'ఇన్వార్డ్ లుకింగ్ పాలసీ' (Inward Looking Policy) పై దృష్టి పెట్టింది. అనగా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ, విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా ఉండే విధానాన్ని అవలంబించింది.
వివరాలు
భారత ప్రభుత్వ వ్యాపార విధానంపై సమీక్ష
భారతదేశ వ్యాపార విధానాన్నిరెండు భాగాలు.. సంస్కరణల ముందు, సంస్కరణల తరువాతగా - విభజించి విశ్లేషించవచ్చు.
1991లో కీలకమైన విదేశీ వాణిజ్య మార్పులతో కూడిన వ్యాపార సరళీకరణ విధానం ప్రవేశపెట్టబడింది. అందువల్ల, ఆ సంవత్సరం భారత వాణిజ్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.
సంస్కరణల ముందు వ్యాపార విధానం
దిగుమతులపై నియంత్రణలు
మహాలనోబిస్ అభివృద్ధి నమూనా అనుసరించడంతో దేశంలో భారీ పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన యంత్రాలు,మూలధన పరికరాలు,విడిభాగాల వంటి వస్తువులను విదేశాలనుండి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
ఇది విదేశీ మారక నిధులపై గణనీయమైన భారం మోపింది. ఆహారధాన్యాల కొరత ఏర్పడిన సమయంలో వాటిని కూడా దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.
వివరాలు
దిగుమతులకు లైసెన్సింగ్ విధానం
అయితే, ఎగుమతుల ఆదాయం తక్కువగానే ఉండటం వల్ల దేశానికి ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు తక్కువయ్యాయి.
దీనిని తలచుకుని 1956-57 నుంచి ప్రభుత్వము దిగుమతులపై కఠిన ఆంక్షలు విధించింది.
దిగుమతులకు లైసెన్సింగ్ విధానం అమల్లో ఉండేది.
పరిమితి పరిమాణాల ఆధారంగా ఆమోదించేవారు. కొన్ని వస్తువులను ప్రభుత్వ రంగ సంస్థలైన స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (STC), మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (MMTC)ల ద్వారా మాత్రమే దిగుమతి చేసుకోవాలనే నిబంధనలు ఉండేవి. ఇవే 'కెనలైజ్డ్ ఐటమ్స్'గా పిలవబడతాయి.
ఈ నియంత్రణలు 1977-78 వరకూ కొనసాగాయి.
వివరాలు
దిగుమతుల ప్రతిస్థాపన విధానం
విదేశీ మారకద్రవ్యాన్ని పొదుపుగా వాడటం,దేశీయ పరిశ్రమలపై ఆధారపడడం వంటి లక్ష్యాలతో దిగుమతుల బదులు స్వదేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించే విధానాన్ని అమలు చేశారు.
దీనిని 'దిగుమతుల ప్రతిస్థాపన' అంటారు. ఇది మూడు దశల్లో అమలైంది.
మొదటి దశలో: వినియోగ వస్తువుల స్థానంలో దేశీయంగా ఉత్పత్తి చేపట్టడం.
రెండో దశలో: మూలధన వస్తువుల కోసం దిగుమతుల బదులు దేశీయ తయారీ.
మూడో దశలో: సాంకేతిక పరిజ్ఞానం దిగుమతులకు ప్రత్యామ్నాయంగా స్వదేశీయ పరిజ్ఞాన అభివృద్ధి.
1977లో జనతా పార్టీ పాలనలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వినియోగ వస్తువుల దిగుమతిని కొంతవరకూ సులభతరం చేశారు.
అనంతరం 1985లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు, విదేశీ వాణిజ్య విధానంలో మొదటి సారి సరళీకరణ చర్యలు తీసుకున్నారు.
వివరాలు
సంస్కరణల అనంతరం.. ఆధునిక వ్యాపార విధానం
ఉత్పాదకతను మెరుగుపరచడం, ఆధునిక సాంకేతికతను అందించేందుకు అనుమతులు ఇవ్వడం మొదలైన చర్యలు తీసుకున్నారు.
సంస్కరణల తరువాత భారతదేశ వాణిజ్య విధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.
ముఖ్యంగా 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో సభ్యత్వం పొందిన తరువాత దిగుమతులపై పరిమాణ నియంత్రణలు పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఏర్పడింది.
అంతర్జాతీయ వాణిజ్యానికి అనుగుణంగా టారిఫ్‌లు తగ్గించబడ్డాయి. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచీకరణ దిశగా తీసుకెళ్లే చర్యలు చేపట్టారు.
వివరాలు
1980వ దశకంలో దిగుమతుల సరళీకరణ
దిగుమతుల సరళీకరణ చర్యలు 1977-78 నుంచే మొదలయ్యాయి. వాటిలో ముఖ్యమైనవి:
ఓపెన్ జనరల్ లైసెన్స్ (OGL): అనేక మూలధన వస్తువులను లైసెన్స్ అవసరం లేకుండా దిగుమతి చేసుకునే అవకాశం కల్పించారు. ముడిపదార్థాలపై లైసెన్సు నియమాలు సడలించి, OGL కేటగిరీలో చేర్చారు. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవడం సులభతరం చేశారు.
ఎగుమతుల ప్రోత్సాహానికి చర్యలు: సంస్కరణలకి ముందు ప్రభుత్వం ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకుంది. ఇందుకు అనుకూలమైన విధానాలు, ప్రోత్సాహక పథకాలు అమలులోకి తెచ్చింది.
వివరాలు
ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు
1966లో, విదేశాలకు సరుకు అమ్మే వ్యాపారులకు నగదు రూపంలో ప్రోత్సాహకంగా సాయాన్ని ప్రభుత్వం అందించడం ప్రారంభించింది.
అదే సంవత్సరం, అంటే 1966లో, రూపాయి విలువను 36.5 శాతం మేరకు తగ్గించారు.
విదేశాలకి సరుకులు ఎగుమతి చేయాలంటే కొన్ని వస్తువులను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా 1957లో "ఇంపోర్ట్ ఎన్‌టైటిల్‌మెంట్ పథకం" అనే విధానాన్ని తీసుకువచ్చారు.
ఎగుమతి ఆధారిత యూనిట్లను (EOUs) ప్రోత్సహించేందుకు, 1981లో ఈ యూనిట్లను అధికారికంగా ప్రవేశపెట్టారు.
ఎగుమతిదారుల అభివృద్ధికి అనువైన, స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే వాతావరణాన్ని కల్పించేందుకు, ప్రభుత్వం 1965లో "ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ జోన్లు (EPZs)" ఏర్పాటుచేసింది. మొదటిగా ఈ తరహా జోన్‌ను కాండ్లాలో ఏర్పాటు చేశారు.
వివరాలు
ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు
విదేశీ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంపై ఆదాయపు పన్నులో కొంతవరకు మినహాయింపు కల్పించారు.
ఎగుమతులను ప్రోత్సహించే దిశగా, ప్రభుత్వమే కొన్ని కీలక పారిశ్రామిక విధాన చర్యలు చేపట్టింది.
1996లో, ఆరు వేలకు పైగా వస్తువుల దిగుమతులపై ఉన్న సుంకాలను తొలగించారు. అనంతరం, 2000-01 ఎక్సిమ్ విధానంలో 714 వస్తువులపై, 2001-02లో మరో 715 వస్తువులపై పరిమితుల్ని తొలగించారు. దీని ద్వారా, WTO నిబంధనల ప్రకారం, పరిమాణ పరమైన ఆంక్షలను పూర్తిగా రద్దు చేశారు.
రాజా చెల్లయ్య కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం, 1993-94 బడ్జెట్‌లో దిగుమతులపై ఉన్న 110 శాతం కస్టమ్స్ డ్యూటీని క్రమంగా తగ్గిస్తూ, 2007-08 నాటికి 10 శాతానికి తీసుకువచ్చారు.
వివరాలు
ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు
రాజా చెల్లయ్య కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం, 1993-94 బడ్జెట్‌లో దిగుమతులపై ఉన్న 110 శాతం కస్టమ్స్ డ్యూటీని క్రమంగా తగ్గిస్తూ, 2007-08 నాటికి 10 శాతానికి తీసుకువచ్చారు.
1991 జులై 1వ తారీఖున, రూపాయి మారకపు విలువను 18 శాతం నుండి 19 శాతానికి సవరించారు.
అనంతరం,1992-93లో రూపాయిని పాక్షికంగా మార్పిడి చేసేందుకు అనుమతి ఇచ్చారు.
1993-94లో మాత్రం పూర్తిస్థాయిలో మార్పిడి చేయడం జరిగింది.ఇక 1994,ఆగస్టులో కరెంట్ అకౌంట్ కోసం పూర్తి మార్పిడిని సాధించారు.
మూలధన ఖాతాలో కూడా లిబరలైజేషన్ చర్యలు తీసుకున్నారు.ప్రస్తుతం రూపాయి మారకం విలువను మార్కెట్ స్వతంత్రంగా నిర్ణయిస్తోంది.
అయితే, చలనం ఎక్కువగా ఉన్న సందర్భాల్లో రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేస్తుంది. దీనిని "మెనేజ్డ్ ఫ్లోటింగ్" విధానం అంటారు.
వివరాలు
ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు
ఎగుమతుల కోసం అవసరమైన దిగుమతులపై పన్ను రాయితీ కల్పించారు. 2004-09 మధ్య వ్యవధిలో అమలైన విదేశీ వ్యాపార విధానంలో, ఎగుమతి సంస్థలను ఐదు విభాగాలుగా విభజించి, వారికి ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలను అందించారు.