Page Loader
పీకల్లోతు కష్టాల్లో ఉన్న 'గో ఫస్ట్' మళ్లీ టేకాఫ్ అవుతుందా? 
పీకల్లోతు కష్టాల్లో ఉన్న 'గో ఫస్ట్' మళ్లీ టేకాఫ్ అవుతుందా?

పీకల్లోతు కష్టాల్లో ఉన్న 'గో ఫస్ట్' మళ్లీ టేకాఫ్ అవుతుందా? 

వ్రాసిన వారు Stalin
May 08, 2023
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వాడియా గ్రూప్ యాజమాన్యంలోని 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్స్ గతవారం స్వచ్ఛంద దివాలా కోసం దాఖలు చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) నిర్ణయం వచ్చే వరకు తన విమానాలను కూడా నిలిపివేసింది. దివాలా దాకా వచ్చిన 'గో ఫస్ట్' విమానంకు ఇంకా టేకాఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్నివర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది మాత్రం ఎన్‌సీఎల్‌టీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని సీఈఓ కౌశిక్ ఖోనా అన్నారు. క్యాష్ అండ్ క్యారీ మోడల్‌లో సుమారు 10రోజుల పాటు కొనసాగించడానికి కంపెనీకి తగినంత నిధులు ఉన్నాయని ఆయన చెప్పారు. దివాలా కోర్టులో లీజర్‌లు విమామానాలను స్వాధీనం చేసుకోకుండా ఉండటానికి ఈ పది రోజులు వ్యవధి అనేది తాత్కాలికంగా నిషేధిస్తుందని వివరించారు.

విమానం

గో ఫస్ట్ విమానయాన సంస్థను 100శాతం కాపాడగలం: సీఈఓ ఖోనా 

తాము 100శాతం గో ఫస్ట్ విమానయాన సంస్థను కాపాడగలమని ఎయిర్ లైన్ సీఈఓ ఖోనా అన్నారు. అయితే, అది జరగడానికి ట్రిబ్యునల్ తక్షణమే దివాలా ప్రక్రియను ప్రారంభించాలని ఆయన అభిప్రాయపడ్డారు. వాస్తవానికి ఎన్‌సీఎల్‌టీ గురువారం గో ఫస్ట్ అభ్యర్థనను విన్నది కానీ తుది ఉత్తర్వుల కోసం దానిని రిజర్వ్ చేసింది. రుణదాతలందరికీ ఎయిర్‌లైన్ మొత్తం ఇప్పుడు దాదాపు రూ. 11,460 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎన్‌సీఎల్‌టీ తక్షణ పరిష్కార మార్గాన్ని చూపడంలో విఫలమైతే, గో ఫస్ట్ ఇబ్బందుల్లో పడుతుంది. గో ఫస్ట్ మళ్లీ ప్రయాణించే అవకాశాలు పూర్తిగా ఎన్‌సీఎల్‌టీ ఆర్డర్‌లపై ఆధారపడి ఉంటుంది.