Loading...
World Bank: ప్రపంచ బ్యాంక్‌ భారత్‌ వృద్ధి అంచనాలు 7.1 శాతానికి పెంపు
ప్రపంచ బ్యాంక్‌ భారత్‌ వృద్ధి అంచనాలు 7.1 శాతానికి పెంపు

World Bank: ప్రపంచ బ్యాంక్‌ భారత్‌ వృద్ధి అంచనాలు 7.1 శాతానికి పెంపు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2026
02:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంకు పెంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.1 శాతం వృద్ధి చెందవచ్చని తాజాగా అంచనా వేసింది. గత జూన్‌లో ఇదే కాలానికి 6.6 శాతం వృద్ధి నమోదవుతుందని పేర్కొన్న ప్రపంచ బ్యాంక్‌.. ఇప్పుడు ఆ అంచనాను 0.5 శాతం పెంచింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారత్‌ ఆశించిన దానికంటే మెరుగైన వృద్ధిని నమోదు చేస్తుండటంతో అంచనాలను సవరించినట్లు 'ఇండియా డెవలప్‌మెంట్‌ అప్‌డేట్‌' నివేదికలో వెల్లడించింది.

వివరాలు 

వినియోగానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి ఊతం

సబ్సిడీలు, తక్కువ ద్రవ్యోల్బణం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పుంజుకుందని ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది.

మరోవైపు ఆదాయపు పన్ను రాయితీలు,జీఎస్టీ రేట్ల తగ్గింపుతో పట్టణ ప్రాంతాల్లోనూ వినియోగం బలపడినట్లు పేర్కొంది.

ఈ పరిణామాలు దేశీయ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తున్నాయని వివరించింది.

పారిశ్రామిక రంగం మెరుగైన పనితీరు

అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ భారత పారిశ్రామిక రంగం అంచనాలకు మించి పనితీరు కనబరిచినట్లు ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది.

దీనివల్ల ఆర్థికవృద్ధికి అదనపు మద్దతు లభిస్తోందని తెలిపింది.

అయితే నైరుతి రుతుపవనాల సమయంలో నమోదైన లోటు వర్షపాతం వ్యవసాయ రంగంపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేసింది.

వ్యవసాయ రంగంలో ఏర్పడే ఈ లోటును పారిశ్రామిక రంగం కొంతమేర భర్తీ చేయవచ్చని అభిప్రాయపడింది.

వివరాలు 

సేవల రంగం స్థిరంగా కొనసాగింపు

భారత్‌లో సేవల రంగం వృద్ధి గతంతో పోలిస్తే కొంత మందగించినప్పటికీ.. ఇప్పటికీ స్థిరమైన స్థాయిలోనే కొనసాగుతోందని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక పేర్కొంది.

మొత్తంగా దేశీయ వినియోగం, పారిశ్రామిక కార్యకలాపాలు ఆర్థిక వృద్ధికి కీలకంగా మారుతున్నాయని వివరించింది.

7 శాతం వృద్ధి అంచనాలు

భారత్‌ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 7 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని పలు అంతర్జాతీయ సంస్థలు కూడా ఇటీవల అంచనా వేశాయి.

ఎస్‌అండ్‌పీ, ఫిచ్‌ రేటింగ్స్‌, ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ), ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) సైతం భారత్‌ వృద్ధి రేటు సుమారు 7 శాతంగా ఉండొచ్చని పేర్కొన్నాయి.

ADVERTISEMENT