Loading...
Zoho CEO: జెన్‌ జీతో పని సంస్కృతి మారలేదు: జోహో సీఈఓ మణి వెంబు
జెన్‌ జీతో పని సంస్కృతి మారలేదు: జోహో సీఈఓ మణి వెంబు

Zoho CEO: జెన్‌ జీతో పని సంస్కృతి మారలేదు: జోహో సీఈఓ మణి వెంబు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2026
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

జెన్‌ జీ కారణంగానే సంప్రదాయ 9-5 పని విధానంలో మార్పులు వచ్చాయనే అభిప్రాయాన్ని జోహో సీఈఓ మణి వెంబు ఖండించారు. ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ కల్చర్‌ అనేది కొత్త భావన కాదని,జోహోలో దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. పని ఎప్పుడు ప్రారంభించారు,ఎప్పుడు ముగించారు అన్నదానికంటే ఉద్యోగికి అప్పగించిన బాధ్యతలను నిర్దేశిత సమయంలో పూర్తి చేశారా లేదా అన్నదే అసలు ప్రమాణమని మణి వెంబు స్పష్టం చేశారు. పనిలో సౌలభ్యాన్ని కోరుకోవడం జెన్‌ జీతో ప్రారంభమైన సంస్కృతి కాదని,ప్రతి తరం ఉద్యోగులూ తమకు అనుకూలమైన పని విధానాన్నే కోరుకుంటూ వచ్చారని పేర్కొన్నారు.

వివరాలు 

వ్యక్తులను కేవలం వయస్సు ఆధారంగా వారి స్వభావాన్ని అంచనా వేయడం సరికాదు 

అందువల్ల ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ విధానాన్ని జెన్‌ జీ ఆవిష్కరించిందని చెప్పడం సరైనది కాదన్నారు.

ఇదే అంశంపై జోహో సహవ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు కూడా స్పందించారు.

వ్యక్తులను కేవలం వయస్సు ఆధారంగా తరాలుగా విభజించి వారి స్వభావాన్ని అంచనా వేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

బాధ్యతాయుతంగా వ్యవహరించడం,ఆర్థిక క్రమశిక్షణ పాటించడం,కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి లక్షణాలు ఏ ఒక్క తరానికీ పరిమితం కావని తెలిపారు.

తమ సంస్థలో పనిచేస్తున్న 19ఏళ్ల యువ ఉద్యోగిని తన కుటుంబ అప్పులు తీర్చడానికే తొలి ప్రాధాన్యం ఇస్తోందని శ్రీధర్‌ వెంబు వెల్లడించారు.

అలాగే మరో ఇద్దరు యువ ఉద్యోగులు ఆడంబరాలకు దూరంగా ఉండి సాదాసీదాగా వివాహాలు చేసుకుని ఖర్చులను తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టిన విషయాన్ని ఉదాహరణగా చెప్పారు.

వివరాలు 

బాధ్యతాయుతమైన వైఖరి,పనితీరు ఆధారంగానే ఉద్యోగుల పనితీరు అంచనా

బాధ్యత, పొదుపు, కుటుంబ విలువలు వంటి అంశాలు కాలంతో లేదా తరాలతో సంబంధం లేనివని, జెన్‌ జీలోనూ ఈ లక్షణాలను సమానంగా చూస్తున్నానని శ్రీధర్‌ వెంబు పేర్కొన్నారు.

ఉద్యోగుల పనితీరును వారి వయస్సు లేదా తరంతో కాకుండా వారి బాధ్యతాయుతమైన వైఖరి, పనితీరు ఆధారంగానే అంచనా వేయాలని ఆయన సూచించారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

30 ఏళ్లుగా ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ అమల్లోనే ఉంది: మణి వెంబు

ADVERTISEMENT