LOADING...
Zoho: జోహోలో 300 మందిని తొలగించారా? వైరల్ వార్తలపై కంపెనీ క్లారిటీ
జోహోలో 300 మందిని తొలగించారా? వైరల్ వార్తలపై కంపెనీ క్లారిటీ

Zoho: జోహోలో 300 మందిని తొలగించారా? వైరల్ వార్తలపై కంపెనీ క్లారిటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 15, 2026
02:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

జోహో కంపెనీపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ పెద్ద చర్చకు దారి తీసింది. జోహోలో దాదాపు 300 మంది ఫ్రెషర్లను ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించారన్న ఆరోపణలు వెలువడటంతో ఐటీ రంగంలో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఫ్రెషర్లుగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతలో ఈ వార్త ఆందోళన కలిగించింది. ఆ పోస్ట్‌లో, కొంతమంది అభ్యర్థులు TCS, Cognizant, Capgemini వంటి పెద్ద కంపెనీల ఆఫర్లను వదిలి జోహోలో చేరారని, చివరికి ఉద్యోగం లేకుండా మిగిలిపోయారని పేర్కొన్నారు. ఇంటివాళ్లు ఎంతో ఆశలు పెట్టుకున్న ఈ అవకాశం చేజారిపోయిందని, కనీసం అక్కడ బెంచ్‌లో ఉన్నా కొంత స్థిరత్వం ఉండేదని భావోద్వేగంగా రాసిన ఈ పోస్ట్ వైరల్ అయ్యింది.

వివరాలు 

ఫ్రెషర్ల భద్రతపై చర్చలు

ఇదే సమయంలో కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన Sridhar Vembuపై కూడా నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తారు. చిన్న పట్టణాల నుంచి టాలెంట్‌ను ప్రోత్సహించే కంపెనీగా పేరున్న జోహో ఇలా చేసిందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతపై, ఫ్రెషర్ల భద్రతపై చర్చలు ముదిరాయి. అయితే ఈ ఆరోపణలను జోహో సంస్థ పూర్తిగా ఖండించింది. ఎలాంటి ఉద్యోగాల తొలగింపులు జరగలేదని స్పష్టం చేసింది.

వివరాలు 

ఈ వ్యవహారం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన అపోహ మాత్రమే

ఈ వ్యవహారంపై కంపెనీ తరఫున స్పందించిన మోహమ్మద్ సోహైల్, ఇది ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన అపోహ మాత్రమేనని వెల్లడించారు. ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన వారిలో కొందరికి మాత్రమే ఫుల్‌టైమ్ ఉద్యోగాలు ఇస్తామని, మిగతావారు ప్రోగ్రామ్ ముగించుకుని వెళ్లడం సాధారణ ప్రక్రియేనని చెప్పారు. అందువల్ల వారిని "తొలగించారు" అని చెప్పడం పూర్తిగా తప్పుదారి పట్టించేదని వివరించారు. ఇంటర్న్‌షిప్‌కు సంబంధం లేకుండా ఫుల్‌టైమ్ నియామకాలు కొనసాగుతున్నాయని, ఫ్రెషర్లకు అవకాశాలు తగ్గలేదని జోహో కంపెనీ క్లారిటీ ఇచ్చింది."

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జోహోలో లేఆఫ్స్ అంటూ వైరల్

Advertisement