Page Loader
ఫ్రెండ్‌షిప్‌డే స్పెషల్‌ : డెలివరీ బాయ్‌ అవాతారం ఎత్తిన జొమాటో సీఈఓ 
డెలివరీ బాయ్‌ అవాతారం ఎత్తిన జొమాటో సీఈఓ

ఫ్రెండ్‌షిప్‌డే స్పెషల్‌ : డెలివరీ బాయ్‌ అవాతారం ఎత్తిన జొమాటో సీఈఓ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 06, 2023
06:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ స్నేహితుల దినోత్సవం సందర్భంగా డెలివరీ బాయ్‌ అవతారమెత్తారు. ఈ మేరకు రెడ్‌ టీ షర్ట్‌ ధరించారు. అనంతరం తన రాయల్‌ ఎన్ఫీల్డ్‌ వాహనంపై ఫుడ్‌ డెలివరీలు అందించేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో అతని చేతిలో ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్స్ ఉండటం విశేషం. డెలివరీ భాగస్వాములు, వినియోగదారులు, రెస్టారెంట్‌ పార్ట్‌నర్స్ అలా కంపెనీతో సంబంధం ఉన్న అందరికీ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లు అందించారు. అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌‌లో గోయల్ షేర్ చేశారు. ఇది తనకు ప్రత్యేకమైన ఆదివారం అంటూ చేసిన ట్వీట్‌ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డెలివరీ బాయ్ వేషధారణలో జొమాటో సీఈఓ