Loading...
72nd National Film Awards: 72వ జాతీయ అవార్డులు.. ఉత్తమ నటులుగా కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టి.. ఉత్తమ నటిగా యామి గౌతమ్!
72వ జాతీయ అవార్డులు.. ఉత్తమ నటులుగా కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టి.. ఉత్తమ నటిగా యామి గౌతమ్!

72nd National Film Awards: 72వ జాతీయ అవార్డులు.. ఉత్తమ నటులుగా కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టి.. ఉత్తమ నటిగా యామి గౌతమ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 18, 2026
06:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పలువురు నటీనటులు, దర్శకులు, చిత్రాలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను కైవసం చేసుకున్నాయి. ఈసారి ఉత్తమ నటుడు, ఉత్తమ నటి విభాగాలతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ బాలల చిత్రం విభాగాల్లోనూ విశేష గుర్తింపు లభించింది. ఉత్తమ నటి విభాగంలో 'ఆర్టికల్ 370' చిత్రంలో అద్భుత నటన కనబరిచిన యామి గౌతమ్ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. సినిమాలో తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆమెకు ఈ ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. యామి గౌతమ్ ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ భార్యగా కూడా సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు.

వివరాలు

ఈసారి ఇద్దరు నటుల ఎంపిక

ఇక ఉత్తమ నటుడు విభాగంలో ఈసారి ఇద్దరు నటులను ఎంపిక చేశారు.

'చందు ఛాంపియన్' చిత్రంలో తన అద్భుత నటనతో ఆకట్టుకున్న బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఒక అవార్డు గ్రహీతగా నిలిచారు.

అలాగే మలయాళ చిత్రం 'భ్రమయుగం'లో అసాధారణ నటన ప్రదర్శించిన మెగాస్టార్ ముమ్ముట్టి కూడా ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.

వీరిద్దరికీ ఈ ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఉత్తమ దర్శకుడు విభాగంలో తమిళ చిత్రం 'అమరన్'కు దర్శకత్వం వహించిన రాజ్‌కుమార్ పెరియసామి జాతీయ అవార్డును అందుకోనున్నారు.

భారత సైన్యాధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలను కూడా సొంతం చేసుకుంది.

వివరాలు

జాతీయ అవార్డుకు ఎంపికైన '35 చిన్న కథ కాదు'

అదే విధంగా ఉత్తమ బాలల చిత్రం విభాగంలో తెలుగు సినిమా '35 చిన్న కథ కాదు' జాతీయ అవార్డుకు ఎంపికైంది.

చిన్న కథాంశంలోనే హృదయాన్ని తాకే భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషంగా నిలిచింది.

మొత్తంగా 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాలు కూడా విశేష ప్రతిభ కనబరిచి పలు ప్రధాన విభాగాల్లో పురస్కారాలను సొంతం చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ADVERTISEMENT