Varanasi Update: 'వారణాసి' షూటింగ్ 85శాతం పూర్తి.. రిలీజ్‌పై రాజమౌళి మాస్టర్ ప్లాన్!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం 'వారణాసి'పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్ సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వివరాలు
85 శాతం షూటింగ్ పూర్తి
తాజా సమాచారం ప్రకారం 'వారణాసి' చిత్రీకరణ ఇప్పటికే దాదాపు 85 శాతం పూర్తయింది.
మిగిలిన 15 శాతం షూటింగ్‌ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం కేటాయించాలని చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముందుగానే నిర్ణయించిన విడుదల తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో మేకర్స్ వేగంగా పనులు పూర్తి చేస్తున్నారని సమాచారం.
వివరాలు
ఈసారి రాజమౌళి ప్లానింగ్ మారింది
సాధారణంగా దర్శకుడు రాజమౌళి తన సినిమాల చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయం తీసుకుంటారనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది.
దీంతో 'వారణాసి' కూడా వాయిదా పడే అవకాశం ఉందని చాలామంది భావించారు.
అయితే ఈసారి మాత్రం ఎలాంటి ఆలస్యం లేకుండా అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో రాజమౌళి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారని టాక్.
షూటింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రతి దశను పగడ్బందీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
విడుదల ఎప్పుడంటే?
భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందుతున్న ఈ చిత్రంలో కథ, విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు అత్యాధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు.
ప్రపంచస్థాయి సినిమాటిక్ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో చిత్రబృందం పనిచేస్తోంది.
వివరాలు
ఐమ్యాక్స్ వెర్షన్‌లో ప్రత్యేక అనుభూతి
ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం ఐమ్యాక్స్ వెర్షన్. భారతీయ సినీ చరిత్రలో పూర్తిస్థాయి ఐమ్యాక్స్ వెర్షన్‌లో రూపొందుతున్న రెండో చిత్రంగా 'వారణాసి' నిలవనుంది.
భారీ తెరపై అద్భుతమైన విజువల్స్‌ను అందించేలా ఈ టెక్నాలజీని వినియోగించనున్నారు. దీంతో థియేటర్లలో ప్రేక్షకులకు మరింత ప్రత్యేకమైన అనుభూతి లభించనుంది.
ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ క్రేజీ కాంబినేషన్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను పెంచేసింది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
ఎస్‌ఎస్ కార్తికేయ, కె.ఎల్. నారాయణ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.