upcoming telugu movies: ఈ వారం థియేటర్లలో 9 సినిమాల రిలీజ్.. ఓటీటీలోనూ ఫుల్ జోష్!
ఈ వార్తాకథనం ఏంటి
అచ్చమైన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్‌లో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించారు. శ్రీ హుసేన్ షా కిరణ్ దర్శకత్వం వహించగా, రెబా మోనికా జాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉత్కంఠభరిత కథా, కథనాలతో రూపొందిన ఈ మూవీ ప్రచార చిత్రాల ద్వారానే ఆసక్తి రేకెత్తిస్తోంది. పాటలు, సాధారణ వినోదం లేకుండా స్వచ్ఛమైన క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు చిత్ర బృందం వెల్లడించింది.
Details
కొత్త జంట కష్టాలు.. నవ్వుల పూదోట
కొత్తగా వివాహం చేసుకున్న ఓ జంట జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటే? భార్య లీలావతి ఎలా స్పందించింది? భర్త ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనే అంశాలతో రూపొందిన చిత్రం సతీ లీలావతి. ఇందులో లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాతినేని సత్య దర్శకత్వం వహించగా, నాగమోహన్ నిర్మించారు. మార్చి 6న ఈ సినిమా విడుదల కానుంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే భావోద్వేగాలు, హాస్యాన్ని మేళవించి తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది.
Details
థ్రిల్ + వినోదం కలయిక
ఈ సినిమా నవ్విస్తుంది, భయపెడుతుంది. చివరివరకు ఉత్కంఠభరితంగా నడుస్తుందని శివాజీ పేర్కొన్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన ఈటీవీ విన్ ఒరిజినల్ చిత్రం సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. లయ కథానాయికగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో అలీ, ధనరాజ్, రోహన్, బబ్లూ, చిత్రం శ్రీను, కమల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మొదట ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఓటీటీలో నేరుగా విడుదల చేయాలని అనుకున్నా, బలమైన కంటెంట్ కారణంగా థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. మార్చి 6న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Details
శోభనం రోజున పెళ్లి కూతురు షాకిస్తే..
మెన్షన్ హౌస్ మల్లేష్ అనే కామెడీ విలేజ్ డ్రామాలో శ్రీనాథ్ మాగంటి కథానాయకుడిగా నటిస్తున్నారు. బాల సతీశ్ దర్శకత్వం వహించగా, గ్రాయత్రి రమణ కథానాయికగా కనిపించనున్నారు. కనకమేడల ప్రొడక్షన్స్ పతాకంపై రాజేష్ నిర్మించారు. మార్చి 6న విడుదల కానున్న ఈచిత్రంలో, కొత్తగా పెళ్లైన మల్లేష్‌కు శోభనం రాత్రే భార్య ఇచ్చిన షాక్ ఏమిటి? అతడు దానిని ఎలా ఎదుర్కొన్నాడు? గ్రామంలో ఉన్న పంచాయతీలు ఎలా సాగాయి? అనే అంశాలను వినోదాత్మకంగా చూపించనున్నారు. కాళిలా మారే సరస్వతి వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం సరస్వతి.ఈటీవీ విన్ సమర్పిస్తున్న ఈ హై కాన్సెప్ట్ థ్రిల్లర్‌లో ప్రియమణి, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలు పోషించారు. మార్చి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది
Details
ఇతర రిలీజ్ లు ఇవే (మార్చి 6, 2026)
కాన: ది ఫారెస్ట్ నటీనటులు: ఆండ్రియా, సలీమ్ గౌస్ దర్శకత్వం: నాన్‌జిల్ మిషన్ సి 1000 నటీనటులు: తేజేశ్వర్, ప్రగ్య నయన్ తదితరులు దర్శకత్వం: తేజేశ్వర్ విధాత నటీనటులు: భాస్కర్, కోటేశ్వరరావు, సుమ తదితరులు దర్శకత్వం: మణికంఠ రాజేంద్రాబు మున్నా (రీ-రిలీజ్) నటీనటులు: ప్రభాస్, ఇలియానా దర్శకత్వం: వంశీ పైడిపల్లి రీ-రిలీజ్: 06-03-2026
Details
ఈ వారం ఓటీటీలో విడుదలలు
నెట్‌ఫ్లిక్స్ విత్ లవ్ (తెలుగు/తమిళ్) - మార్చి 6 హలో బచ్చో (తెలుగు/హిందీ) - మార్చి 6 ఆహా ఓం శాంతి శాంతి శాంతిః (తెలుగు) - మార్చి 4 ఈటీవీ విన్ చరిత కామాక్షి (తెలుగు) - మార్చి 5 జీ5 గాంధీ టాక్స్ (తెలుగు/తమిళ్) - మార్చి 6 జియో హాట్ స్టార్ ఫాల్ గాయ్ (ఇంగ్లీష్/తెలుగు) - మార్చి 3 అమెజాన్ ప్రైమ్ వీడియో ఎ లిటిల్ ప్రేయర్ (ఇంగ్లీష్) - మార్చి 3 ది మొమెంట్ (ఇంగ్లీష్) - మార్చి 3 సుబేదార్ - మార్చి 5 ఈ వారం థియేటర్లు, ఓటీటీ వేదికల్లో విభిన్న శైలుల చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.