Loading...
Vrushakarma Budget : రూ.100 కోట్లకు పైగా బడ్జెట్.. నాగ చైతన్య ముందు రూ.300 కోట్ల టార్గెట్!
రూ.100 కోట్లకు పైగా బడ్జెట్.. నాగ చైతన్య ముందు రూ.300 కోట్ల టార్గెట్!

Vrushakarma Budget : రూ.100 కోట్లకు పైగా బడ్జెట్.. నాగ చైతన్య ముందు రూ.300 కోట్ల టార్గెట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2026
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

'తండేల్' సినిమాతో యువ సామ్రాట్ నాగ చైతన్య తన కెరీర్‌లో మరో కీలక విజయాన్ని అందుకున్నారు. వరుస పరాజయాలకు బ్రేక్ వేయడంతో పాటు రూ.100 కోట్ల వసూళ్ల మార్కును అందుకున్న తొలి అక్కినేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ విజయంతో మంచి జోష్‌లో ఉన్న చైతూ.. ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో 'వృషకర్మ' సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది.

వివరాలు

రూ.100 కోట్లు దాటిన బడ్జెట్?

నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో 'వృషకర్మ' రూపొందుతోంది. ఈ సినిమా బడ్జెట్ ఇప్పటికే రూ.100 కోట్లు దాటినట్లు సమాచారం.

కథకు అవసరమైన భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం నిర్మాతలు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

వివరాలు

చైతూ ముందు భారీ బాక్సాఫీస్ టార్గెట్

రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో సినిమా రూపొందుతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వసూళ్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం నాగ చైతన్య ముందు భారీ లక్ష్యమే ఉంది. 'వృషకర్మ'తో రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు వసూళ్లు సాధించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ మార్కును అందుకుంటే ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలవనున్న 25వ సినిమాకు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు

సుకుమార్ సూచనలతో స్క్రిప్ట్‌కు మెరుగులు?

మరోవైపు దర్శకుడు కార్తీక్ వర్మ దండుకు ఆయన గురువు సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే విషయంలో కీలక సూచనలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

దీంతో 'వృషకర్మ'పై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

'విరూపాక్ష'తో దర్శకుడిగా మంచి గుర్తింపు కార్తీక్ వర్మ తెచ్చుకున్నారు.

'తండేల్' విజయాన్ని కొనసాగిస్తూ 'వృషకర్మ'తో మరో భారీ హిట్ అందుకోవాలని నాగ చైతన్య భావిస్తున్నారు. భారీ బడ్జెట్, మైథలాజికల్ నేపథ్యం, విజువల్ ఎఫెక్ట్స్, సుకుమార్ భాగస్వామ్యం వంటి అంశాలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

మరి డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న 'వృషకర్మ' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

ADVERTISEMENT