Ram Charan: రామ్ చరణ్ సినిమాలో నటించే ఛాన్స్.. RC17 కోసం ఆడిషన్స్ ప్రారంభం!
ఈ వార్తాకథనం ఏంటి
గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ RC17 కోసం చిత్రబృందం నటీనటుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఈ సినిమాలో నటించాలనుకునేవారికి అవకాశం కల్పిస్తూ మేకర్స్ అధికారికంగా ఆడిషన్స్‌కు పిలుపునిచ్చారు. అన్ని వయసుల వారు ఈ ఆడిషన్స్‌లో పాల్గొనవచ్చని ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. 'కొత్త ప్రపంచం.. సరికొత్త కథ.. అందులో మీకో పాత్ర ఎదురుచూస్తుంది' అంటూ క్యాస్టింగ్ ప్రకటనను పంచుకున్నారు. ఈ సినిమాలో నటించాలనుకునేవారు తమ ఆడిషన్ వీడియోలను src17casting@gmail.com మెయిల్‌కు పంపించాలని సూచించారు.
వివరాలు
ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు
మరిన్ని వివరాల కోసం 9110564651 వాట్సాప్ నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'రంగస్థలం' బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో మరోసారి ఈ కాంబోపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
మొత్తానికి RC17 ఆడిషన్స్ ప్రకటనతో మెగా అభిమానులతో పాటు నటనపై ఆసక్తి ఉన్న యువతలోనూ ఉత్సాహం మొదలైంది.