LOADING...
This week Telugu Movies: సినీ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. థియేటర్‌లో 'పెద్ది', ఓటీటీలో వరుస యాక్షన్ సినిమాలు రెడీ
సినీ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. థియేటర్‌లో 'పెద్ది', ఓటీటీలో వరుస యాక్షన్ సినిమాలు రెడీ

This week Telugu Movies: సినీ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. థియేటర్‌లో 'పెద్ది', ఓటీటీలో వరుస యాక్షన్ సినిమాలు రెడీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2026
06:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతి తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఆశించిన స్థాయిలో పెద్ద సినిమాలు రాకపోవడంతో ఏర్పడిన లోటును భర్తీ చేయడానికి సిద్ధమవుతోంది 'పెద్ది' (Peddi Movie). రామ్‌ చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకంటే ముందే జూన్ 3న రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ప్రీమియర్ షోలకు అనుమతులు లభించగా, తెలంగాణలో అనుమతులపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. .

వివరాలు

బాక్సాఫీస్ హిట్ 'ధురంధర్' ఓటీటీలోకి

థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar: The Revenge) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. భారత్‌లో ఈ సినిమా 'జియో హాట్‌స్టార్' వేదికగా జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అంతకంటే ముందుగా జూన్ 4న రాత్రి 7 గంటలకు డిజిటల్ ప్రీమియర్ ప్రదర్శించనున్నారు. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉండనుంది. భారత్ బయట ప్రేక్షకులకు మాత్రం 'నెట్‌ఫ్లిక్స్' (Dhurandhar 2 OTT) ద్వారా వీక్షణ అవకాశం ఉంటుంది.

వివరాలు

మలయాళ స్టార్ కాంబో 'పేట్రియాట్' ఓటీటీ రిలీజ్

మలయాళ అగ్ర నటులు మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటించిన 'పేట్రియాట్' (Patriot Movie) చిత్రం జీ5 (Zee5) వేదికగా జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ఆడియో వెర్షన్ కూడా అందుబాటులో ఉండనుంది. దేశభక్తి నేపథ్యంతో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నయనతార, ఫహాద్ ఫాజిల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

వివరాలు

కన్నడ యాక్షన్ మూవీ 'కేడీ: ది డెవిల్' కూడా అదే రోజు ఓటీటీలో

అర్జున్ మేనల్లుడు ధ్రువ్ సర్జా హీరోగా నటించిన యాక్షన్ చిత్రం 'కేడీ: ది డెవిల్' (KD The Devil) కూడా జూన్ 5 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. రీష్మా హీరోయిన్‌గా నటించగా, సంజయ్ దత్, శిల్పా శెట్టి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. థియేటర్లలో 'పెద్ది' హవా కొనసాగుతుండగా, మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో భారీ యాక్షన్ సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Advertisement

వివరాలు

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే

అమెజాన్‌ ప్రైమ్‌ ద లెజెండ్‌ ఆఫ్‌ ఓక్స్‌ మెషీనా (మూవీ) - జూన్‌ 3 క్లార్క్‌సన్స్‌ఫార్మ్‌ సీజన్‌ 5 (వెబ్‌సిరీస్‌) - జూన్‌ 3 నెట్‌ఫ్లిక్స్‌ 29 (మూవీ) తమిళం/తెలుగు - జూన్‌ 5 మా బెహన్‌ (మూవీ) -జూన్‌ 4 ఆఫీస్‌ రొమాన్స్‌(మూవీ) - జూన్‌ 5 ద మార్క్‌డ్‌ ఉమెన్‌ (మూవీ) - జూన్‌ 5 ద బ్లడ్‌ సిస్టర్స్‌ (మూవీ) -జూన్‌ 5 మెక్సికో 86 (మూవీ) -జూన్‌ 5 యాపిల్‌ టీవీ కేప్‌ ఫియర్‌ (మూవీ) - జూన్‌ 5

Advertisement