Fauzi : ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్.. 'ఫౌజీ' టీజర్‌కు ముహూర్తం ఫిక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ డ్రామా 'ఫౌజీ'. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'ఫౌజీ' నుంచి ప్రత్యేకమైన టీజర్ వీడియోను విడుదల చేసేందుకు చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 'వరల్డ్ ఆఫ్ ఫౌజీ' పేరుతో ఈ వీడియోను అదే రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
వివరాలు
వేగంగా జరుగుతున్న 'ఫౌజీ' షూటింగ్
ఈ స్పెషల్ వీడియో ద్వారా 'ఫౌజీ' సినిమా ప్రపంచాన్ని, అందులో ప్రభాస్ పోషిస్తున్న పాత్ర లుక్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది.
అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరోవైపు 'ఫౌజీ' సినిమా చిత్రీకరణ కూడా వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం భారీ యాక్షన్ షెడ్యూల్ జరుగుతోంది.
ఈ షెడ్యూల్ అక్టోబర్ 20 వరకు కొనసాగనుందని సమాచారం. ఆ తర్వాత సుమారు 10 రోజుల పాటు టాకీ పార్ట్ షూటింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
అలాగే ప్రభాస్‌పై ఓ ప్రత్యేకమైన మాస్ మోంటాజ్ సాంగ్‌ను కూడా చిత్రీకరించేందుకు మేకర్స్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం.