Loading...
Ramayana Trailer: యుగాల కథకు నూతన రూపం.. ప్రతి ఫ్రేమ్‌లో మహోన్నతం.. 'రామాయణ' ట్రైలర్‌ విశేషాలివే!
యుగాల కథకు నూతన రూపం.. ప్రతి ఫ్రేమ్‌లో మహోన్నతం.. 'రామాయణ' ట్రైలర్‌ విశేషాలివే!

Ramayana Trailer: యుగాల కథకు నూతన రూపం.. ప్రతి ఫ్రేమ్‌లో మహోన్నతం.. 'రామాయణ' ట్రైలర్‌ విశేషాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2026
11:44 am

ఈ వార్తాకథనం ఏంటి

అజరామరమైన రామాయణం.. ఎన్నిసార్లు విన్నా, ఎన్ని రూపాల్లో చూసినా కొత్తగానే అనిపించే భారతీయ మహాకావ్యం. యుగాలు మారినా, తరాలు మారినా శ్రీరాముడి గాథ నిత్యనూతనంగానే నిలిచింది. ఇప్పటికే ఎన్నోసార్లు వెండితెరపై ఆవిష్కృతమైన ఈ ఇతిహాసం ఇప్పుడు మరోసారి ప్రపంచ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈభారీ బాధ్యతను బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ తన భుజాలపై వేసుకున్నారు. ఆయన తెరకెక్కించిన 'రామాయణ' చిత్రం ట్రైలర్‌ నేడు బ్రహ్మ ముహూర్తంలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అత్యున్నత నిర్మాణ విలువలు, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌, అబ్బురపరిచే గ్రాఫిక్స్‌తో రూపొందిన ఈ ట్రైలర్‌ ప్రతి ఫ్రేమ్‌లోనూ ఓ విజువల్ స్పెక్టకిల్‌లా కనిపిస్తోంది. కల్యాణం, వనవాసం, సీతాపహరణం, రామ-రావణ యుద్ధం వంటి కీలక ఘట్టాలను వైభవంగా ఆవిష్కరించారు.

వివరాలు

రావణుడి గాంభీర్యంతో మొదలైన ట్రైలర్

నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ ప్రేక్షకులను నేరుగా త్రేతాయుగంలోకి తీసుకెళ్లేలా రూపొందించారు.

దేవలోకం.. భూలోకం.. పాతాళలోకం.. ముల్లోకాల్లో ఇక ఒక్కటే సామ్రాజ్యం.. రావణ రాజ్యం అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది.

రావణుడి పాత్రలో యశ్ కనిపించిన ప్రతిసారి ఆయన గంభీరమైన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాత్రకు తగ్గ తీరు, ఆహార్యం, డైలాగ్ డెలివరీతో యశ్ ప్రభావం స్పష్టంగా కనిపించింది.

ధర్మానికి ప్రతీకగా రాణబీర్ కపూర్

చీకట్లను పారదోలేందుకు ప్రతి యుగంలోనూ శ్రీమహావిష్ణువు అవతారమెత్తుతాడనే నేపథ్య వాయిస్‌తో రాముడి పాత్రను పరిచయం చేశారు.

ప్రశాంతత, వినయం, ధర్మనిష్ఠను ప్రతిబింబించే రాముడిగా రణ్‌బీర్ కపూర్ ఆకట్టుకున్నారు. ఆయన హావభావాలు, స్క్రీన్ ప్రెజెన్స్ పాత్రకు పూర్తి న్యాయం చేసినట్లు కనిపిస్తోంది.

వివరాలు

ఖడ్గం పట్టిన యోధురాలిగా సీత

ట్రైలర్‌లో ఎక్కువ చర్చకు దారితీసిన అంశాల్లో ఒకటి సీతాదేవి పాత్ర. సాధారణంగా మృదుస్వభావానికి ప్రతీకగా చూపించే సీతను ఈ సినిమాలో ఖడ్గం పట్టిన యోధురాలిగా చూపించడం విశేషం.

ముఖ్యంగా లక్ష్మణ రేఖ ఘట్టంలో కూడా ఆమె చేతిలో ఖడ్గం కనిపించడం వల్ల ఈ పాత్రను కొత్త కోణంలో ఆవిష్కరించినట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

పుష్పక విమానం, ఐరావతం.. కొత్త డిజైన్‌తో విజువల్ ట్రీట్

రామాయణంలో అత్యంత కీలకమైన పుష్పక విమానం ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

గత చిత్రాల్లో సాధారణ రూపంలో కనిపించిన ఈ విమానాన్ని, ఈసారి భారీ తామరపువ్వు ఆకారంలో వినూత్నంగా రూపొందించారు.

అలాగే లంక విజయం అనంతరం మూడు లోకాలపై ఆధిపత్యం కోసం రావణుడు దేవేంద్రుడిపై యుద్ధానికి వెళ్లే సన్నివేశాల్లో ఐరావతాన్ని అద్భుతమైన విజువల్స్‌తో ఆవిష్కరించారు.

సీతను అపహరించే సమయంలో రావణుడిని అడ్డుకునే జటాయువు పాత్రను భారీ గరుత్మంతుడి రూపంలో శక్తివంతంగా చూపించడం కూడా ఆకట్టుకుంది.

ADVERTISEMENT

వివరాలు

విద్యుజ్జిహ్వకు ప్రత్యేక స్థానం

శూర్పణఖ భర్త విద్యుజ్జిహ్వ పాత్రలో వివేక్ ఒబెరాయ్ కనిపించారు.

రావణుడితో ఆయన మధ్య జరిగే ఘర్షణ చూస్తుంటే, ఇప్పటివరకు తెరపై పెద్దగా కనిపించని పాత్రలకు కూడా ఈ సినిమాలో సముచిత ప్రాధాన్యం కల్పించినట్లు అనిపిస్తోంది.

రాముడి వనవాసానికి కారణమైన మంథర పాత్రలో శీబా చద్దా, కైకేయి పాత్రలో లారా దత్త తమ పాత్రలకు తగ్గట్టుగా కనిపించారు.

వివరాలు

పరశురాముడు, భరతుడి ఘట్టాలు హైలైట్

శివధనుస్సు విరిచిన అనంతరం పరశురాముడు రాముడిని కలిసే ఘట్టాన్ని కూడా ట్రైలర్‌లో చూపించారు.

ధర్మ బాధ్యతలను రాముడికి అప్పగించి తపస్సు కోసం వెళ్లే పరశురాముడి పాత్రలో కూడా రణ్‌బీర్ కపూర్ కనిపించడం ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌గా అనిపించింది.

అలాగే రాముడిని తిరిగి అయోధ్యకు తీసుకురావడానికి చిత్రకూటానికి వెళ్లిన భరతుడు, రాముడు నిరాకరించడంతో ఆయన పాదుకలను సింహాసనంపై ఉంచి రాజ్యాన్ని పాలించిన ఘట్టాన్ని కూడా హృద్యంగా చూపించారు.

ఈ పాత్రలో ఆదినాథ్ కొఠారే ఆకట్టుకున్నారు. హనుమంతుడిగా సన్నీ దేవోల్, లక్ష్మణుడిగా రవీ దూబే కూడా తమ పాత్రలకు న్యాయం చేసినట్లు ట్రైలర్‌లో కనిపిస్తోంది.

వివరాలు

శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్రలో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాముడిని ఆకర్షించే ప్రయత్నం చేయడం, అనంతరం లక్ష్మణుడు ఆమె ముక్కు కోసే సన్నివేశాలను ట్రైలర్‌లో చూపించారు.

ప్రతీకారం తీర్చుకుంటాను శూర్పణఖ.. రాముడికి జరిగే అవమానం ఘోరంగా ఉంటుందంటూ రావణుడిగా యశ్ చెప్పే డైలాగ్‌తో రామ-రావణ యుద్ధం ఎంత భీకరంగా ఉండబోతోందో దర్శకుడు హింట్ ఇచ్చారు.

మొత్తం మీద చూస్తే 'రామాయణ' ట్రైలర్ కేవలం ఒక సినిమా ప్రచార వీడియోలా కాకుండా, భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో ఆవిష్కరించే మహత్తర సినీ ప్రయాణానికి నాందిగా కనిపిస్తోంది.

వివరాలు

మూవీపై భారీగా అంచనాలు

అద్భుతమైన విజువల్స్‌, శక్తివంతమైన పాత్రలు, భారీ నిర్మాణ విలువలు, అగ్రశ్రేణి సంగీతం కలిసి ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచాయి.

ఇప్పటికే ట్రైలర్‌కు వస్తున్న విశేష స్పందనను బట్టి, విడుదల తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT