Loading...
Anil Ravipudi: జగపతి బాబుతో సినిమా.. అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్ ఇదేనా?
జగపతి బాబుతో సినిమా.. అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Anil Ravipudi: జగపతి బాబుతో సినిమా.. అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్ ఇదేనా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 17, 2026
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా చేసిన ఓ ప్రకటన ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వరుస బ్లాక్‌బస్టర్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఆయన, సీనియర్ నటుడు జగపతి బాబుతో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ చేయబోతున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. ప్రస్తుతం విలన్‌, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న జగపతి బాబు హీరోగా పెద్దగా మార్కెట్ లేకపోయినా, అనిల్ ఇలాంటి ప్రకటన చేయడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జగపతి బాబు చాలా కాలం తర్వాత 'వదల' చిత్రంతో హీరోగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగకపోవడంతో నిర్మాతలే స్వయంగా విడుదల చేస్తున్నారు.

వివరాలు

జగపతిబాబుతో త్వరలో సినిమా

అలాంటి సమయంలో 'వదల' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన అనిల్ రావిపూడి, వేదికపైనే జగపతి బాబుతో తన కాంబినేషన్‌లో త్వరలో అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా ఉంటుందని ప్రకటించారు.

అయితే అది తన తదుపరి చిత్రమా? లేక తర్వాతి ప్రాజెక్ట్‌ల్లో ఒకటా? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి కెరీర్ అత్యున్నత స్థాయిలో కొనసాగుతోంది. వరుసగా రెండు 300కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు, సంక్రాంతికి విడుదలైన 'మనశంకర వరప్రసాద్' విజయంతో ఆయన మార్కెట్ మరింత పెరిగింది.

ప్రస్తుతం వెంకటేష్, కల్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్న ఆయన, ఆ తర్వాత బాలకృష్ణతో మరో సినిమా చేసే అవకాశముందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

వివరాలు

త్వరలోనే మరిన్ని వివరాలు

ఇలాంటి సమయంలో జగపతి బాబుతో సినిమా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

మరో ఆసక్తికర అంశం ఏమిటంటే... ఇటీవల కాలంలో అనిల్ రావిపూడి ఎక్కువగా మల్టీస్టారర్ కథలనే ఎంచుకుంటున్నారు.

'F2' నుంచి ఇద్దరు హీరోల కాన్సెప్ట్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్న ఆయన, 'మన శంకర వరప్రసాద్'లో ఇద్దరు సీనియర్ స్టార్లను ఒకే తెరపైకి తీసుకువచ్చారు.

ప్రస్తుతం తెరకెక్కిస్తున్న వెంకటేష్-కల్యాణ్ రామ్ చిత్రమూ అదే తరహాలో ఉంది.

ఈ నేపథ్యంలో జగపతి బాబు హీరోగా మాత్రమే కాకుండా, ఆయనతో పాటు మరో హీరో కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT