
Mohanlal: సినీ నటుడు మోహన్‌లాల్‌కి అరుదైన గౌరవం.. సైన్యాధిపతి చేతులమీదుగా సత్కారం
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ (Mohanlal) మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది చేతుల మీదుగా ఆయన 'సీవోఏఎస్ కమెండేషన్ కార్డు' (COAS Commendation Card)ను స్వీకరించారు. ఇది ఆర్మీకి విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు. ఈ సన్మానంపై మోహన్‌లాల్ సోషల్ మీడియాలో స్పందించారు. లెఫ్టినెంట్ కర్నల్‌గా ఈ పురస్కారాన్ని అందుకోవడం తనకు గర్వకారణమని తెలిపారు.
Details
ఇటీవల దాదా సాహెల్ ఫాల్కే అవార్డు అందుకున్న మోహన్ లాల్
అలాగే భారత ఆర్మీ, టెరిటోరియల్ ఆర్మీతో పాటు జనరల్ ఉపేంద్ర ద్వివేది గారికి కృతజ్ఞతలు తెలిపారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, మోహన్‌లాల్ 2009 సంవత్సరం నుంచి టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్‌గా సేవలందిస్తున్నారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా భారతీయ సినీ రంగానికి చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ఇటీవల ఆయనకు దేశ అత్యున్నత సినీ గౌరవమైన 'దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు' ప్రదానం చేశారు.