LOADING...
Bollywood: బూట్‌ పాలిష్‌ చేసే కార్మికుడికి బాలీవుడ్‌లో అరుదైన అవకాశం 
బూట్‌ పాలిష్‌ చేసే కార్మికుడికి బాలీవుడ్‌లో అరుదైన అవకాశం

Bollywood: బూట్‌ పాలిష్‌ చేసే కార్మికుడికి బాలీవుడ్‌లో అరుదైన అవకాశం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 02, 2025
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

చండీగఢ్‌లో బూట్‌ పాలిష్‌ చేస్తూ జీవనం నెట్టుకొస్తున్న వికాస్‌ మాన్‌ జీవితంలో అదృష్టం అనూహ్యంగా తలుపుతట్టింది. బాలీవుడ్‌లో అడుగుపెట్టే అవకాశం ఆయన ముందుకొచ్చింది. నవాజుద్దీన్‌ సిద్దిఖీ నటిస్తున్న చిత్రంలో పాటలు పాడేందుకు వికాస్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది. చండీగఢ్‌ సెక్టార్‌-17లో బూట్లు పాలిష్‌ చేస్తూనే తన మధుర గాత్రంతో అక్కడికి వచ్చే వారిని అలరించడం వికాస్‌ రోజువారీ అలవాటే. రాజస్థాన్‌లో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచే పాటల మీద మక్కువతో పెరిగారు.

Details

వచ్చే ఏడాది ముంబయికి వెళ్లే అవకాశం

దిల్లీ, చండీగఢ్‌లలో పెరుగుతూ సంగీత సాధన కొనసాగించారు. ప్రస్తుతం తన ముగ్గురు సోదరీమణులతో కలిసి చండీగఢ్‌లోనే నివసిస్తున్నారు. ముఖ్యంగా సూఫీ సంగీతాన్ని ఆయన అద్భుతంగా ఆలపిస్తారని స్థానికులకు సుపరిచితం. వికాస్‌ గానం ఆకట్టుకున్నందున కొందరు ఆయనను వివిధ ఫంక్షన్లకు ఆహ్వానిస్తూ పాటలు పాడిస్తుంటారు. అలాంటి ఒక సందర్భంలో ఓ వ్యక్తి వికాస్‌ ప్రతిభను గుర్తించి అతని ఫోన్‌ నంబర్‌ తీసుకుని బాలీవుడ్‌ అవకాశానికి చేరవేశారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది మార్చిలో వికాస్‌ ముంబయికి వెళ్లి చిత్రానికి పాటలు రికార్డ్‌ చేయనున్నారు.

Advertisement