Loading...
Mamitha Baiju: రూ.200 కోట్ల హ్యాట్రిక్.. మమితా బైజు పేరిట అరుదైన రికార్డు!
రూ.200 కోట్ల హ్యాట్రిక్.. మమితా బైజు పేరిట అరుదైన రికార్డు!

Mamitha Baiju: రూ.200 కోట్ల హ్యాట్రిక్.. మమితా బైజు పేరిట అరుదైన రికార్డు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2026
01:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

'ప్రేమలు' సినిమాతో ఒక్కసారిగా యూత్ క్రష్‌గా మారిన మలయాళ ముద్దుగుమ్మ 'మమితా బైజు'. ప్రస్తుతం వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా ఎదుగుతోంది. తన క్యూట్ లుక్స్, సహజమైన నటనతో ఆకట్టుకుంటున్న ఈ భామ తాజాగా భారతీయ సినీ చరిత్రలోనే అరుదైన ఘనత సాధించినట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం 29 రోజుల వ్యవధిలో మమిత నటించిన మూడు సినిమాలు వరుసగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించడంతో.. ఇలా హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ నటిగా ఆమె రికార్డు సృష్టించినట్లు సమాచారం.

వివరాలు

'జననాయగన్'తో మొదలు..

ఎన్నో వాయిదాల అనంతరం జులై 23న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'జననాయగన్' మంచి విజయాన్ని అందుకుంది.

విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మమిత 'విజ్జి' పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.

వివరాలు

'విశ్వనాథ్ అండ్ సన్స్'లో మరో విజయం

సూర్య కథానాయకుడిగా నటించిన భారీ చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' కూడా విడుదలైన కొద్దిరోజుల్లోనే భారీ వసూళ్లు సాధించింది.

ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్ల గ్రాస్ రాబట్టి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో మమిత నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అల్లరి చేసే అమ్మాయిగా ప్రేక్షకులను మెప్పించిన ఆమె.. ఆ తర్వాత తల్లిగా భావోద్వేగభరితమైన నటనతోనూ ఆకట్టుకుంది.

ADVERTISEMENT

వివరాలు

'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్'తో హ్యాట్రిక్

నివిన్ పౌలీతో కలిసి మమిత నటించిన మలయాళ చిత్రం 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' ఆగస్టు 21న విడుదలైంది.

ఈ సినిమా కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే రూ.200 కోట్ల మార్క్‌ను దాటి రూ.250 కోట్ల దిశగా దూసుకెళ్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రాన్ని తెలుగులో సెప్టెంబరు 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ADVERTISEMENT

వివరాలు

మమిత గురించి ఆసక్తికర విషయాలు

అసలు పేరు నమిత

మమిత అసలు పేరు నమిత. ఆమె బర్త్ సర్టిఫికెట్ తయారు చేసే సమయంలో ఆసుపత్రి సిబ్బంది పొరపాటున 'మమిత' అని నమోదు చేశారు. ఆ పేరే తర్వాత కొనసాగింది.

కూచిపూడిలో శిక్షణ

మమిత కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకుంది.

అల్లు అర్జున్ అంటే ఇష్టం

మమిత అల్లు అర్జున్‌కు వీరాభిమాని. బన్ని నటించిన ప్రతి సినిమాను థియేటర్‌లో కనీసం పదిసార్లు చూస్తుందట.

తెలుగు సినిమాలంటే ఇష్టం

మమితకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. ఆమె మొదట చూసిన తెలుగు సినిమా 'మగధీర'.

మొత్తంగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న మమితా బైజు.. తక్కువ వ్యవధిలోనే భారీ బాక్సాఫీస్ విజయాల్లో భాగమై అరుదైన రికార్డు సాధించడం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT