
Allu Arjun: సినిమాకి సినిమాకీ వైవిధ్యం.. అల్లు అర్జున్ సినీ ప్రయాణా విశేషాలు
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్ సినీ ప్రపంచంలో తన ప్రత్యేకతను ప్రదర్శిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.
తన కష్టం, ప్రతిభకు తగ్గట్టు ఆయన ఇప్పుడొక సినిమాకు రూ.300 కోట్లు పారితోషికం అందుకుంటున్నారు, ఇది సాధారణ విషయం కాదు.
ప్రముఖ ఫోర్బ్స్ ఇండియా ప్రకారం, 2024లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న భారతీయ నటులలో అగ్ర స్థానంలో నిలిచారు.
అయితే, ఆయన సినీ ప్రయాణం కేవలం రూ.100 పారితోషికంతో ప్రారంభమైనట్టు చాలా మందికి తెలియదు.
'పుష్ప 2' విడుదలకు సిద్దమవుతున్న ఈ సమయంలో, అల్లు అర్జున్ విజయాల పరంపరను చూద్దాం.
వివరాలు
బాలనటుడి నుంచి కథానాయకుడి వరకు
'విజేత', 'స్వాతిముత్యం'లో బాలనటుడిగా మెరిసిన అల్లు అర్జున్ డ్యాన్స్‌లో ఉన్న ఆసక్తితో చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు.
రాఘవేంద్రరావు గమనించి, భవిష్యత్తులో హీరోగా తీర్చిదిద్దుతానని మాటిచ్చారు.
2003లో 'గంగోత్రి'తో కథానాయకుడిగా ఆయన అడుగుపెట్టారు, ఇది దర్శకుడు రాఘవేంద్రరావు 100వ చిత్రం కావడం విశేషం.
అర్జున్ అభిమానులు కాదు.. ఆర్మీ!
'గంగోత్రి' విజయంతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినా, నిజమైన గుర్తింపు సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన 'ఆర్య' తో వచ్చింది.
యువతను ఆకట్టుకునే ప్రేమకథ, డ్యాన్స్ నైపుణ్యం ఈ చిత్రానికి వేదికయ్యాయి. 'బన్నీ', 'దేశముదురు' వంటి చిత్రాలు మాస్ ఆడియన్స్‌తో అతడిని మరింత దగ్గర చేశాయి.
వివరాలు
వివిధ పాత్రలతో విజయాలు
అల్లు అర్జున్ కమర్షియల్ సినిమాలతో పాటు, 'వేదం' లోని కేబుల్ రాజు, 'రుద్రమదేవి'లో గోన గన్నారెడ్డి వంటి పాత్రల్లో నటించి తన ప్రతిభను ప్రదర్శించారు.
'నా పేరు సూర్య' లో సైనికుడిగా ఒదిగి నటనలో కొత్త పుంతలు తొక్కారు.
పుష్ప: ఒక సంచలన ప్రయాణం
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప: ది రైజ్' అల్లు అర్జున్‌కి కొత్త స్థాయిని తెచ్చింది.
రఫ్ లుక్, పవర్‌ఫుల్ డైలాగ్స్, ప్రేక్షకుల హృదయాలను కదిలించాయి. ఈ చిత్రంతో ఆయనకు జాతీయ అవార్డు లభించింది.
వివరాలు
మలయాళం నుంచి హిందీ వరకు ఆదరణ
అల్లు అర్జున్‌ను మలయాళ అభిమానులు ప్రేమతో 'మల్లు అర్జున్' అని పిలుస్తారు.
ఉత్తర భారత దేశంలోనూ ఆయన సినిమాలు డబ్ చేసి రికార్డు స్థాయిలో వ్యూస్ పొందాయి. 'పుష్ప 1' హిందీలో రూ.108 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
కుటుంబానికి సమయం కేటాయింపు
తన బిజీ షెడ్యూల్‌లోనూ కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఇద్దరు పిల్లలతో స్నేహితుడిలా ఉండే బన్నీ, తెర వెనుక చాలా భావోద్వేగాలతో నిండిన వ్యక్తి.
అల్లు అర్జున్ తన ప్రతిభ, సంకల్పంతో అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు పొందుతూ, సాంఘిక స్పృహ కలిగిన వ్యక్తిగా నిలిచారు.