Loading...
Fauzi : ప్రభాస్‌ బర్త్‌డే స్పెషల్‌.. 'ఫౌజీ' నుంచి అదిరిపోయే అప్‌డేట్‌!
ప్రభాస్‌ బర్త్‌డే స్పెషల్‌.. 'ఫౌజీ' నుంచి అదిరిపోయే అప్‌డేట్‌!

Fauzi : ప్రభాస్‌ బర్త్‌డే స్పెషల్‌.. 'ఫౌజీ' నుంచి అదిరిపోయే అప్‌డేట్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2026
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులకు అదిరిపోయే తీపి కబురు అందింది. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై, విలక్షణ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'ఫౌజీ'. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర నిర్మాత వై. రవిశంకర్‌ స్వయంగా వెల్లడించారు.

వివరాలు

ప్రభాస్‌ పుట్టినరోజున 'ఫౌజీ' అప్‌డేట్‌!

'దొంగ నా కొడుకు' సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న హీరో మౌళి.. తనదైన శైలిలో సరదాగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాత రవిశంకర్‌ను ప్రశ్నించారు.

అసలు ఫౌజీ అప్‌డేట్‌ ఏంటి సర్‌? ప్రభాస్‌ గారి సినిమా అప్‌డేట్‌ ఏంటి? సోషల్‌ మీడియాలో దీనిపైనే పెద్ద చర్చ నడుస్తోంది. మీ దగ్గర నుంచే ఆ అప్‌డేట్‌ను లాగేయాలని చూస్తున్నానంటూ మైక్‌ అందుకుని నవ్వులు పూయించారు.

మౌళి ప్రశ్నకు నిర్మాత రవిశంకర్‌ సరదాగా స్పందిస్తూనే ప్రభాస్‌ అభిమానులకు కీలక విషయాన్ని వెల్లడించారు. అక్టోబర్‌ 23న ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా 'ఫౌజీ' సినిమా నుంచి ప్రత్యేకమైన చిన్న వీడియోను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ వీడియో గ్లింప్స్‌ లేదా ఇన్ఫర్మేషన్‌ వీడియో రూపంలో ఉండనుందని తెలిపారు.

వివరాలు

సినిమా కథ, ప్రభాస్‌ పాత్రపై క్లారిటీ!

సాధారణంగా సినిమాల నుంచి విడుదల చేసే భారీ యాక్షన్‌ గ్లింప్స్‌లా కాకుండా.. 'ఫౌజీ' కథా నేపథ్యం, ఇందులో ప్రభాస్‌ పాత్ర స్వభావం, కథ ఏ కాలానికి సంబంధించింది వంటి అంశాలను పరిచయం చేసేలా ఈ వీడియోను రూపొందించనున్నట్లు రవిశంకర్‌ వెల్లడించారు.

సినిమాలోని కీలక అంశాలను ప్రేక్షకులకు అర్థమయ్యేలా వివరించడం ఈ వీడియో ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

ముఖ్యంగా, 'బాహుబలి' స్థాయి భారీ యాక్షన్‌ కట్‌ తరహాలో కాకుండా.. సినిమా అసలు కథ, దాని నేపథ్యం, ప్రపంచాన్ని పరిచయం చేసేలా ఈ వీడియో ఉంటుందని స్పష్టం చేశారు.

'వరల్డ్‌ ఆఫ్‌ ఫౌజీ' (World of Fauji) ఎలా ఉండబోతోందనే విషయంపై అభిమానులకు స్పష్టత లభించనుంది.

ADVERTISEMENT

వివరాలు

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లతో పాటు థియేటర్లలోనూ!

'ఫౌజీ' ప్రత్యేక వీడియోను డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లతో పాటు మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై రూపొందిన సినిమాలు ప్రదర్శితమవుతున్న థియేటర్లలోనూ విడుదల చేయనున్నట్లు నిర్మాత రవిశంకర్‌ తెలిపారు.

దీంతో ప్రభాస్‌ పుట్టినరోజున అభిమానులు ఈ వీడియోను డిజిటల్‌ మాధ్యమాల్లోనే కాకుండా వెండితెరపై కూడా చూసే అవకాశం కలగనుంది.

మొత్తంగా అక్టోబర్‌ 23న ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా 'ఫౌజీ' నుంచి అధికారిక అప్‌డేట్‌ రానుండటంతో డార్లింగ్‌ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

సినిమా కథ, ప్రభాస్‌ పాత్ర, కథా ప్రపంచం గురించి మరింత స్పష్టత ఇచ్చే ఈ ప్రత్యేక వీడియో కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT