Loading...
Dhanush: ధనుష్‌ పొలిటికల్‌ ఎంట్రీపై చర్చ.. టీవీకే కీలక వ్యాఖ్యలు!
ధనుష్‌ పొలిటికల్‌ ఎంట్రీపై చర్చ.. టీవీకే కీలక వ్యాఖ్యలు!

Dhanush: ధనుష్‌ పొలిటికల్‌ ఎంట్రీపై చర్చ.. టీవీకే కీలక వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 20, 2026
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం కొంతకాలంగా జోరుగా సాగుతోంది. ఆయన తన అభిమాన సంఘం పేరును 'ధనుష్‌ నర్పణి ఇయక్కం'(ధనుష్‌ సంక్షేమ ఉద్యమం)గా మార్చడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ధనుష్‌ రాజకీయ రంగ ప్రవేశంపై తమిళనాడులో అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) స్పందించింది. ధనుష్‌ రాజకీయాల్లోకి రావాలనుకుంటే స్వాగతిస్తామని స్పష్టం చేసింది. టీవీకే అధికార ప్రతినిధి ఎం. సత్యకుమార్‌ ఈ అంశంపై మాట్లాడుతూ.. తమ పార్టీ రాజకీయ ప్రయాణం ఇతరులకు స్ఫూర్తిగా నిలిచి, వారు కూడా రాజకీయాల్లోకి రావాలనుకోవడం సంతోషకరమని అన్నారు. నటుడిగా ఉన్నత స్థాయిలో ఉన్న సమయంలోనే విజయ్‌ సినిమాలను పక్కనపెట్టి రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారని గుర్తుచేశారు.

వివరాలు

అంత సులభమైన ప్రయాణం కాదు

''విజయ్‌ ఇందుకోసం 30 ఏళ్లపాటు కృషి చేశారు. ఇది అంత సులభమైన ప్రయాణం కాదని సత్యకుమార్‌ పేర్కొన్నారు.

రాజకీయ పార్టీని స్థాపించడం ఒక ఎత్తయితే.. దానిని నిలబెట్టుకోవడం, ఎన్నికల్లో విజయం సాధించడం మరో ఎత్తు అని అభిప్రాయపడ్డారు.

రాజకీయాల్లోకి రావాలని భావించే వారు ఈ రంగానికి పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు.

ADVERTISEMENT