Pragyan Ojha: అగార్కర్ స్థానంలో ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్టర్‌గా రమేశ్ పొవార్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాకు అవకాశం దక్కింది. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన అజిత్ అగార్కర్ స్థానంలో ఓజా బాధ్యతలు చేపట్టనున్నాడు. అక్టోబర్ 4న అగార్కర్ పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రజ్ఞాన్ ఓజా తాత్కాలిక చీఫ్ సెలక్టర్‌గా కొనసాగుతున్నాడు. సౌత్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడికి తాజాగా ఈ అవకాశం లభించింది. టీమిండియా తరఫున ప్రజ్ఞాన్ ఓజా 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. గతేడాది సెప్టెంబర్‌లో అతడిని సెలక్టర్‌గా నియమించారు. ఇప్పుడు చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో భారత జట్టు ఎంపికలో ఓజా కీలక పాత్ర పోషించనున్నాడు.
వివరాలు
సెలక్టర్‌గా రమేశ్ పొవార్ ఎంపిక
మరోవైపు అజిత్ అగార్కర్ స్థానంలో వెస్ట్ జోన్ నుంచి రమేశ్ పొవార్ సెలక్టర్‌గా ఎంపికయ్యాడు. ఈ పదవి కోసం రమేశ్ పొవార్‌తో పాటు మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా దరఖాస్తు చేసుకున్నాడు.
అయితే, ఇంటర్వ్యూ ప్రక్రియలో మేనేజ్‌మెంట్ రమేశ్ పొవార్ వైపే మొగ్గు చూపించింది. భారత్ తరఫున రమేశ్ పొవార్ రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడాడు.
క్రికెటర్‌గా తన సేవలు అందించిన అతడికి కోచ్‌గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ముఖ్యంగా టీమ్‌ఇండియా మహిళా జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు.
ఈ అనుభవంతో ఇప్పుడు సెలక్టర్‌గా భారత క్రికెట్ జట్టు ఎంపిక ప్రక్రియలో భాగం కానున్నాడు.