Pakistan Airspace Ban: భారత విమానాలకు పాకిస్తాన్ షాక్.. గగనతల నిషేధం మరో నెల పొడిగింపు!
ఈ వార్తాకథనం ఏంటి
దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత విమానాలపై గగనతల నిషేధాన్ని పొడిగించింది. మరో నెల రోజుల పాటు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. భారత్లో రిజిస్టర్ అయిన విమానాలతో పాటు, భారత విమానయాన సంస్థలకు చెందిన విమానాలు, ఆ సంస్థలు లీజుకు తీసుకున్న విమానాలపైనా ఈ నిషేధం వర్తించనుంది. భారత సైనిక విమానాలకు కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయి. పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకారం.. ఈ నిషేధం 2026 నవంబర్ 24వ తేదీ ఉదయం 5.59 గంటల వరకు అమల్లో ఉంటుంది.
వివరాలు
ఆపరేషన్ సిందూర్ తర్వాత గగనతల నిషేధం
2025 ఏప్రిల్ 23న పాకిస్తాన్ భారత విమానాలపై గగనతల నిషేధాన్ని విధించింది. అప్పటి నుంచి ఈ ఆంక్షలను ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోంది.
పాకిస్థాన్ తన గగనతలాన్ని కరాచీ, లాహోర్ అనే రెండు ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్లుగా విభజించింది.
తాజాగా పొడిగించిన నిషేధం ఈ రెండు ప్రాంతాలకూ వర్తిస్తుంది. 2025లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
ఈ నేపథ్యంలో భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టి, పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని పలు ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది.
దీనికి ప్రతిస్పందనగా పాక్ సైన్యం భారత్పై దాడులకు ప్రయత్నించింది.
వివరాలు
పాకిస్తాన్ విమానాలపైనా భారత్ ఆంక్షలు
ఈ క్రమంలో భారత్ క్షిపణులు, వైమానిక దాడులతో పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.
ఈ దాడుల్లో రాడార్ కేంద్రాలు, విమాన హ్యాంగర్లు, రన్వేలు ధ్వంసమైనట్లు కథనంలో పేర్కొన్నారు. అప్పటి నుంచి పాకిస్తాన్ భారత విమానాలపై విధించిన గగనతల నిషేధాన్ని పొడిగిస్తూ వస్తోంది.
పాకిస్తాన్ చర్యలకు ప్రతిస్పందనగా భారత్ కూడా ఆ దేశ విమానయాన సంస్థలకు తన గగనతలాన్ని మూసివేసింది. 2025 ఏప్రిల్ 30 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
దీంతో ఇరు దేశాలు పరస్పరం తమ గగనతలాల్లోకి ప్రత్యర్థి దేశ విమానాల ప్రవేశాన్ని నిషేధించా
వివరాలు
అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ప్రభావం
పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేయడం భారత పౌర విమానయాన రంగంపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా యూరప్, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే భారత విమానాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది.
కొన్ని విమానాలు అరేబియా సముద్రం మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడంతో ప్రయాణ దూరం పెరుగుతోంది.
ఢిల్లీ వంటి ఉత్తర భారతదేశంలోని విమానాశ్రయాల నుంచి అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లే విమానాలకు అదనపు సమయం పడుతోంది.
మార్గాలు మారడం వల్ల ఇంధన వినియోగం, నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి విమానయాన సంస్థల కార్యకలాపాలపై, అంతర్జాతీయ ప్రయాణాల సమయాలపై ప్రభావం చూపుతోంది.