Loading...
Jaya Krishna: జయకృష్ణ కోసం సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌.. రెండో సినిమాకు రంగం సిద్ధం?
జయకృష్ణ కోసం సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌.. రెండో సినిమాకు రంగం సిద్ధం?

Jaya Krishna: జయకృష్ణ కోసం సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌.. రెండో సినిమాకు రంగం సిద్ధం?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2026
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఘట్టమనేని కుటుంబానికి చెందిన జయకృష్ణ ఘట్టమనేని 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ మాస్‌ కథాంశం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ముఖ్యంగా ట్రైలర్‌ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో సినిమాకు థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. అయితే తొలి సినిమానే అయినప్పటికీ జయకృష్ణ తన నటనతో మంచి మార్కులు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా కోసం కథలు వింటున్నారు. ఈ నేపథ్యంలో జయకృష్ణ రెండో సినిమాపై ఆసక్తికరమైన వార్త టాలీవుడ్‌లో వినిపిస్తోంది. సూపర్‌స్టార్‌ కృష్ణకు వీరాభిమానిగా పేరున్న ప్రముఖ నిర్మాత, మహేశ్‌బాబుతో పలు సినిమాలు నిర్మించిన అనిల్‌ సుంకర.. జయకృష్ణతో రెండో సినిమా నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.

వివరాలు

త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం

ఇందులో భాగంగా తన నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై 'సామజవరగమనా', 'నారీ నారీ నడుమ మురారీ' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు రామ్‌ అబ్బరాజుతో అనిల్‌ సుంకర చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రామ్‌ అబ్బరాజు 'సామజవరగమనా 2' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అదే సమయంలో జయకృష్ణ కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

కథ విషయంలో అంతా అనుకున్నట్లుగా కుదిరితే.. వచ్చే ఏడాది ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై జయకృష్ణ రెండో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

మరి ఈ ప్రాజెక్ట్‌ నిజంగా కార్యరూపం దాల్చి.. జయకృష్ణకు రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహిస్తారా? అనేది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత రానుంది.

ADVERTISEMENT