Prince Cecil wedding: సినీ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్.. ప్రియురాలిని పెళ్లాడిన టాలీవుడ్ నటుడు
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యువ నటుడు ప్రిన్స్ సిసిల్ ఓ ఇంటివాడయ్యారు. తన లాంగ్‌టైమ్ ప్రియురాలు సాయి ప్రతిమ (సాయి మాచిరాజు)ను ఆయన ఆగస్టు 24న న్యూజిలాండ్‌లో తెలుగు సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ప్రస్తుతం ప్రిన్స్ సిసిల్, సాయి ప్రతిమ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కొత్త జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రిన్స్ సిసిల్ సినీ కెరీర్ విషయానికొస్తే.. ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే ఆయన దర్శకుడు తేజ దృష్టిలో పడ్డారు. అనంతరం 2012లో విడుదలైన 'నీకు నాకు డ్యాష్ డ్యాష్' సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.
వివరాలు
'బస్ స్టాప్' చిత్రంలో ఫేమస్
అదే ఏడాది దర్శకుడు మారుతి తెరకెక్కించిన 'బస్ స్టాప్' చిత్రంలో నటించారు.
ఈ సినిమా యూత్‌లో ప్రిన్స్‌కు మంచి గుర్తింపు, క్రేజ్‌ను తీసుకొచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ప్రిన్స్ సిసిల్.. 2017లో ప్రసారమైన 'బిగ్ బాస్ తెలుగు' తొలి సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు.
ఈ రియాలిటీ షో ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అనంతరం 'డీజే టిల్లు' సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించారు.
ఇలా సినిమాలు, బుల్లితెర కార్యక్రమాలతో ప్రేక్షకులకు చేరువైన ప్రిన్స్ సిసిల్.. ఇప్పుడు తన లాంగ్‌టైమ్ ప్రియురాలు సాయి ప్రతిమతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
వివరాలు
అభినందనల వెల్లువ
న్యూజిలాండ్‌లో తెలుగు సంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానులు ప్రిన్స్ సిసిల్‌కు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు.