LOADING...
Alpha Trailer: యాక్షన్ ప్రియులకు పండుగే.. 'ఆల్ఫా' ట్రైలర్‌లో అదరగొట్టిన అలియా భట్

Alpha Trailer: యాక్షన్ ప్రియులకు పండుగే.. 'ఆల్ఫా' ట్రైలర్‌లో అదరగొట్టిన అలియా భట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2026
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' ట్రైలర్ బుధవారం (జూన్ 17) విడుదలైంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, బాబీ డియోల్ విలన్ పాత్ర, చివర్లో హృతిక్ రోషన్ సర్‌ప్రైజ్ ఎంట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

వివరాలు

'సీత'గా అలియా భట్

ట్రైలర్ ప్రారంభంలో ఓ గాజు గదిలో ఉన్న చిన్నారిని చూపిస్తూ ఆమెకు 'సీత' అని పేరు పెట్టినట్లు విలన్ ఫతే పాత్రలో నటిస్తున్న బాబీ డియోల్ చెబుతాడు. ఆ చిన్నారిని చిన్నప్పటి నుంచే అత్యంత ప్రమాదకరమైన హంతకురాలిగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇస్తాడు. ఆదేశం అందితే క్షణాల్లో టార్గెట్‌ను అంతం చేసే కిల్లింగ్ మెషిన్‌గా ఆమెను తయారు చేస్తాడు. అయితే కథలో కీలక మలుపు ఏమిటంటే.. తనను పెంచిన ఫతే నిజానికి ఒక క్రూరమైన వ్యక్తి అని, ఓ యువరాణిని అపహరించిన లంకేశ్వరుడిలాంటి వాడని సీత గ్రహిస్తుంది. రామాయణంలోని సీతలా ఎవరో వచ్చి కాపాడతారని ఎదురుచూడకుండా, తాను నేర్చుకున్న విద్యతోనే అతని సామ్రాజ్యాన్ని కూల్చివేయాలని నిర్ణయించుకుంటుంది.

వివరాలు

శర్వరీ, అనిల్ కపూర్ కీలక పాత్రలు

ఫతేపై పోరాటంలో సీతకు శర్వరీ తోడవుతుంది. వీరిద్దరినీ ఒక వ్యూహాత్మక మిషన్‌లో నడిపించే ఏజెంట్ పాత్రలో అనిల్ కపూర్ కనిపిస్తారు. ఇక ఫతే పాత్రకు కూడా బలమైన బ్యాక్‌స్టోరీ ఉన్నట్లు ట్రైలర్ సూచిస్తోంది. దేశం కోసం పనిచేసి మోసపోయిన మాజీ స్పైగా కనిపించే అతడు, "ఒకప్పుడు ఇండియా ఆల్ఫా విలువ తెలుసుకోలేదు.. ఇప్పుడు అదే ఇండియా ఆల్ఫా పేరు వింటే వణికిపోతుందంటూ దేశంపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తాడు. అతడిని అడ్డుకునేందుకు అతని చేతిలోనే పెరిగిన సీత ఎలాంటి వ్యూహాలు రచించిందనేదే సినిమా ప్రధాన కథాంశంగా కనిపిస్తోంది.

Advertisement

వివరాలు

హృతిక్ రోషన్ ఎంట్రీతో ట్రైలర్‌కు అదనపు బలం

ట్రైలర్ చివర్లో మేకర్స్ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. 'వార్', 'వార్ 2' చిత్రాల్లో కనిపించిన కల్ట్ స్పై క్యారెక్టర్ 'మేజర్ కబీర్ ధలివాల్' పాత్రలో హృతిక్ రోషన్ ఈ మిషన్‌లో భాగమవుతున్నట్లు చూపించారు. ట్రైలర్‌లో హృతిక్ ముఖాన్ని పూర్తిగా చూపించకపోయినా, కేవలం అతని కళ్లు మాత్రమే కనిపించే షాట్‌తోనే స్పై యూనివర్స్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశారు. థియేటర్లలో ఈ సన్నివేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

వివరాలు

వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్

ట్రైలర్ విడుదలకు ముందు అలియా భట్, శర్వరీతో కలిసి దిగిన సరదా ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. టీజర్‌పై వచ్చిన విమర్శలకు వాటి ద్వారా ఆమె చురుకైన సమాధానం ఇచ్చినట్లు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'వార్', 'పఠాన్', 'టైగర్ 3', 'వార్ 2' చిత్రాల తర్వాత వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న తాజా భారీ ప్రాజెక్ట్ 'ఆల్ఫా'. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ జులై 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది

Advertisement