LOADING...
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్?.. ఏడాదిలోనే 3 భారీ సినిమాల ప్లాన్!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్?.. ఏడాదిలోనే 3 భారీ సినిమాల ప్లాన్!

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్?.. ఏడాదిలోనే 3 భారీ సినిమాల ప్లాన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2026
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

పాన్-ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ఉన్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్-ఇండియా సినిమాలే కావడంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమాల విడుదల కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం అన్నీ అనుకున్నట్లు జరిగితే కేవలం ఒకే ఏడాది వ్యవధిలో ప్రభాస్ మూడు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే అభిమానులకు నిజమైన పండగనే చెప్పాలి.

వివరాలు

శరవేగంగా ఫౌజీ షూటింగ్

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 'ఫౌజీ', 'స్పిరిట్', 'కల్కి 2', 'సలార్ 2' వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులున్నాయి. వీటిలో మొదటగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న 'ఫౌజీ'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఎలాగైనా ఈ ఏడాది డిసెంబర్ నాటికి చిత్రాన్ని విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'స్పిరిట్'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

వివరాలు

2027 మార్చిలో విడుదలయ్యే అవకాశాలు

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం 2027 మార్చిలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'కల్కి 2' ఒకటి. 2024లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన 'కల్కి 2898 AD' చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అధికారిక విడుదల తేదీ ఇంకా ప్రకటించకపోయినా, 2027 డిసెంబర్ నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Advertisement

వివరాలు

ప్రభాస్ అభిమానుల్లో ఫుల్ జోష్

ఈ ప్రణాళికలు అన్నీ అనుకున్నట్లుగా అమలైతే, 2026 డిసెంబర్ నుంచి 2027 డిసెంబర్ వరకు కేవలం 12 నెలల వ్యవధిలోనే ప్రభాస్ 'ఫౌజీ', 'స్పిరిట్', 'కల్కి 2' వంటి మూడు భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంటుంది. ఒకే స్టార్ హీరో నుంచి ఒకే ఏడాదిలో ఇంతటి స్థాయి భారీ పాన్-ఇండియా సినిమాలు రావడం చాలా అరుదైన విషయమనే చెప్పాలి. అందుకే ఈ వార్త ప్రస్తుతం ప్రభాస్ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపుతోంది.

Advertisement